Kushi: పవన్ కళ్యాణ్ ఖుషి మూవీకి సొంతమైన సూపర్ రికార్డ్ ఇదే!

  • July 30, 2024 / 12:07 PM IST

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చినా త్వరలో పవన్ సినిమాలతో బిజీ అవుతారని అభిమానులు ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న సినిమాలకు సంబంధించి డేట్స్ విషయంలో స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలలో ఏ సినిమా కూడా ఆగిపోయే అవకాశం అయితే లేదని భోగట్టా. పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ లో ఎన్నో సంచలన రికార్డులను సొంతం చేసుకున్నారు.

పవన్ సినిమాలు క్రియేట్ చేసి ఇప్పటికీ బ్రేక్ కాని రికార్డ్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఖుషి (Kushi) మూవీకి సొంతమైన సూపర్ రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ రికార్డ్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అప్పట్లో సంధ్య థియేటర్ లో ఈ సినిమా కోటీ 56 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే సినిమా విడుదలై ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ రికార్డ్ మాత్రం బ్రేక్ కాలేదు.

సంధ్య థియేటర్ లో పవన్ రికార్డ్ ను ఏ సినిమా బ్రేక్ చేయలేదని తెలిసి ఫ్యాన్స్ సైతం ఎంతో సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సుముఖంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus