“అజ్ణాతవాసి” డిజాస్టర్ అనంతరం పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా స్వస్తిపలికి రాజకీయాలపై దృష్టిసారించాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయమై పవన్ కూడా స్పందించి.. “నా దృష్టి మొత్తం రాజకీయాల మీదే ఉంది, ఇప్పుడు సినిమాలు చేయను” అని కూడా ఒక ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. అయితే.. పవన్ నిర్ణయం ఆయనకి భారీ నష్టంతోపాటు బోలెడన్ని తలపోట్లు తెచ్చిపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా కాస్త గట్టిదే. విషయం ఏంటంటే.. “కాటమరాయుడు” టైమ్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసేందుకు సంసిద్ధత తెలిపి వారి నుంచి భారీ మొత్తం అడ్వాన్స్ కూడా స్వీకరించాడు. ఒక తమిళ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకొని ఆ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు కూడా చేయించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ సడన్ డెసిషన్ తో షాక్ అయ్యింది. అయితే.. వారు అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఏమైనా వెనక్కి ఇస్తాడేమో అని ఎదురుచూసిన సంస్థ యాజమాన్యానికి సరైన సమాధానం దొరకలేదు.
పవన్ కళ్యాణ్ ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు సన్నద్ధమయ్యారు మైత్రీ మూవీ మేకర్స్ యజమానులు. ఇచ్చిన అడ్వాన్స్ కు వడ్డీ కట్టి మొత్తం 20 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్ గా చల్లించడమైనా చేయాలి లేకుంటే ప్రామిస్ చేసినట్లుగా తమ సంస్థలో ఒక సినిమా అయినా చేయాలి అని ఒక చిన్నసైజు అల్టిమేటం జారీచేశారట. దాంతో పవన్ కళ్యాణ్ ధీర్ఘాలోచనలో పడ్డాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను 20 కోట్ల రూపాయలు చల్లించడం అనేది జరగని పని అలాగే.. ఇంకో సినిమా చేస్తే తన రాజకీయ సమీకరణల్లో మళ్ళీ భారీ మార్పులు వస్తాయి. అందుకే ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కళ్యాణ్ బాబు.