Pawan Kalyan: జనసేనకు ఆ మూవీ కలెక్షన్లు అందజేసిన నాగబాబు.. ఎంత ఇచ్చారంటే?

  • December 15, 2023 / 03:56 PM IST

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ లలో ఎప్పుడు పాల్గొంటారనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. పవన్ నటించిన గుడుంబా శంకర్ మూవీ కొంతకాలం క్రితం రీ రిలీజ్ కావడంతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రీరిలీజ్ ద్వారా వచ్చిన డబ్బుల్లో 35 లక్షల రూపాయలను నాగబాబు జనసేనకు మద్దతుగా అందజేయడం గమనార్హం.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ఈ మొత్తాన్ని నాగబాబు అందజేశారు. నాగబాబు మాట్లాడుతూ గుడుంబా శంకర్ మూవీకి వచ్చిన కలెక్షన్లలో సింహ భాగం 35 లక్షల రూపాయలు పార్టీకి మద్దతుగా అందజేశామని అన్నారు. ఆరెంజ్ రీరిలీజ్ సమయంలో కోటీ 5 లక్షల రూపాయలు, జల్సా రీ రిలీజ్ సమయంలో కోటి రూపాయలు పార్టీకి అందజేశామని చెప్పుకొచ్చారు.

గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ మొత్తాన్ని అందించడం జరుగుతోందని నాగబాబు తెలిపారు. పవన్ చేస్తున్న కార్యక్రమాలకు ఈ డబ్బులు సహాయపడతాయని ఆయన కామెంట్లు చేస్తున్నారు. పవన్ ఈ ఏడాది బ్రో సినిమాను మాత్రమే రిలీజ్ చేయగా వచ్చే ఏడాది పవన్ నటించిన రెండు సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంది. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు సైతం పవన్ కళ్యాణ్ జాబితాలో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉండగా ఇతర భాషల్లో సైతం పవన్ సత్తా చాటి క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం. పవన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus