Pawan Kalyan: ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డు ఎలా ఉందంటే?

  • April 8, 2021 / 11:46 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘వకీల్ సాబ్’ చిత్రం రేపు అంటే ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది. 3 ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ నుండీ రాబోతున్న చిత్రం… అలాగే థియేటర్లు తెరుచుకున్న తరువాత టాలీవుడ్లో విడుదల కాబోతున్న పెద్ద చిత్రం.. అందుకు తగినట్టే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇప్పుడు గాడినపడిన నేపథ్యంలో పవన్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అందులోనూ ఉగాది సెలవు కూడా ఈ చిత్రానికి ఓ అడ్వాంటేజ్ అని చెప్పాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే…గతంలో కూడా ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్ని విడుదలయ్యాయి.ఆ సినిమాలు ఏంటి? అందులో హిట్లు ఎన్ని ఉన్నాయి.. ప్లాప్ లు ఎన్ని ఉన్నాయి? వాటి వివరాలను ఓసారి పరిశీలిద్దాం రండి :

1) బద్రి: పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బద్రి’ చిత్రం 2000వ సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన చిత్రమిది.ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ నంద అనే పాత్రని పోషించాడు. రేపు విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ లో కూడా ప్రకాష్ పేరు నందనే కావడం విశేషం.

2) ఖుషి: పవన్ కళ్యాణ్ – ఎస్.జె.సూర్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఖుషి’ చిత్రం 2001వ సంవత్సరం ఏప్రిల్ 27న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది పవన్ కెరీర్లో ఓ క్లాసిక్ అని కూడా చెప్పుకోవచ్చు.

3) జాని: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా కూడా మారుతూ చేసిన చిత్రం ‘జాని’. 2003వ సంవత్సరం ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. అతనికి వరుస ప్లాపులు మొదలైంది ఈ చిత్రంతోనే..!

4) జల్సా: పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రమిది. 2008వ సంవత్సరం ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి.. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు రిలీఫ్ ఇచ్చింది.

5) తీన్ మార్: పవన్ కళ్యాణ్ – జయంత్.సి.పరాన్జీ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది.2011వ సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలయ్యింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘లవ్ ఆజ్ కల్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసాడు.బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్లాప్ గా మిగిలింది.

6) సర్దార్ గబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్ – కె.ఎస్.రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ కు సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ ఇది. ‘గబ్బర్ సింగ్’ చిత్రం పదేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ. ఆ చిత్రానికి రీమేక్ అనే సరికి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే 2016వ సంవత్సరం ఏప్రిల్ 8న విడుదలైన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు కథ కూడా అందించాడు.

అదండీ.. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డు ఇలా ఉంది. 1 బ్లాక్ బస్టర్, 2 సూపర్ హిట్లు.. 2 డిజాస్టర్లు, 1ప్లాప్. మరి రేపు విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతుందో?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus