వకీల్ సాబ్ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి పవన్ కళ్యాణ్ మెప్పించిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగుతోంది. 5 రోజుల్లో 70 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన వకీల్ సాబ్ మూవీ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో ప్రూవ్ చేసింది. గత కొన్ని నెలల నుంచి వరుసగా సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందికి కరోనా సోకడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సీమ స్లాంగ్ లో డైలాగులు చెబుతారని తెలుస్తోంది. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ రీమేక్ సినిమాకు చాలా టైటిళ్లు ప్రచారంలోకి రాగా ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ ప్రముఖ రచయిత పెంచల్ దాస్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పాట కూడా పాడనున్నారని సంగీత దర్శకుడు థమన్ వెల్లడించారు.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పవన్ తెలంగాణ యాసలో మాట్లాడిన వకీల్ సాబ్ హిట్ కావడంతో సీమ స్లాంగ్ లో మాట్లాడిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ వకీల్ సాబ్ మ్యాజిక్ ను అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!