Pawan Kalyan: ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన పవన్.. భారీగా పెరుగుతున్న ఫాలోవర్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు సినిమాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయపరంగా సినిమాలపరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ట్విట్టర్లో ఆయన అధికారక ఖాతా ఉంది కానీ ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ అధికారక ఖాతా లేదు. దీంతో ఈయన త్వరలోనే ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి రాబోతున్నారని నాగబాబు కూడా వెల్లడించారు. ఈ వార్తలకు అనుగుణంగానే నేడు ఉదయం పవన్ కళ్యాణ్ అధికారక ఇంస్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు.అయితే ఈయన ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు నిమిషం నిమిషానికి తనకు ఫాలోవర్స్ పెరుగుతూ వస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఉన్న మ్యాటర్ నే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ లో కూడా పెట్టుకున్నారు. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..Jai Hind! అని తన అకౌంట్ లో పెట్టుకున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఒకరిని కూడా ఫాలో కాలేదు. అలాగే ఎలాంటి పోస్టులు కూడా చేయలేదు కానీ ఈయనకు మాత్రం ఫాలోవర్స్ భారీగా పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే 24 గంటలలో పవన్ కళ్యాణ్ కు ఎంత మంది ఫాలోవర్స్ వస్తారన్న విషయం గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన తర్వాత తన మొదటి పోస్ట్ ఏం చేయబోతున్నారనే విషయం గురించి కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ ద్వారా కేవలం తన జనసేన పార్టీకి సంబంధించిన విషయాలను మాత్రమే తెలియజేయబోతున్నారని సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉండవని తెలిసి అభిమానులు ఈ విషయంలో కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలాంటి విషయాలను షేర్ చేయబోతున్నారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus