పవన్ – వర్మ.. ఎవరికి మీ ఓటు..?

పవన్ అంటే రాజకీయాల్లోకి వస్తున్నారు గనక ఎలక్షన్లు.. ఓట్లు.. అనే మాటలు వినపడొచ్చు. గ్యాంగ్స్టర్లు, రౌడీల కథల పరిశోధనలో ఉండే వర్మకి ఓట్లతో ఏం సంబంధం అన్న అనుమానం తలెత్తుతోంది కదూ. అసలీ ఓటింగ్ కి తెర తీసింది శ్రీ శ్రీ శ్రీ రామ్ గోపాల్ వర్మ గారే.

తన చివరి తెలుగు సినిమాగా వంగవీటి సినిమాని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వర్మ ఈ సినిమా కోసం ఓ పాట పాడారు. బహుశా సినిమా కోసం ఆయన తన గళం విప్పింది ఇదే తొలిసారి. దానికి ప్రచారం కల్పించేందుకు లేక మరే కారణమో గానీ మొన్నటి సభలో పవన్ పాడిన పాటతో పోలుస్తూ మా ఇద్దరిలో ఎవరు మంచి గాయకుడు అంటూ తన సహజధోరణిలో చర్చ లేవదీశారు. దీనికి అందరి హీరోల ఫాన్స్ తోపాటు పవన్ కూడా స్పందించాలన్న వర్మ మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్, థమన్ లాంటి సంగీత దర్శకులను జడ్జ్ చేయాల్సిందిగా కోరాడు. ఈ ఓటింగ్ లో గెలుపెవరిదంటారు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus