Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మెగా మల్టీస్టారర్?

  • February 5, 2022 / 09:16 AM IST

గతంలో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు సరికొత్త గా తెరపైకి రాబోతున్నాయి. ఇప్పటికే మెగా నందమూరి కలయికలో మొదటి సినిమా రాజమౌళి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. RRR సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ నటించిన ఆచార్య సినిమా కూడా అంచనాలను పెంచనుంది.

Click Here To Watch

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్స్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరొక దర్శకుడు మెగా హీరోలను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ను అలాగే ఆయన మేనల్లుడిని కలిపి వెండితెరపై చూపించే ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు అల వైకుంఠపురములో సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించిన సముద్రఖని.

సౌత్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు అందుకున్న సముద్రఖని చాలా కాలం నుంచి టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తన దగ్గర ఉన్న ఒక కథను వినిపించడంతో ఆయన పవన్ కళ్యాణ్ కు అయితే కరెక్టుగా సరిపోతుంది అని అలాగే మరొక ముఖ్యమైన పాత్ర కోసం కూడా సాయిధరమ్ తేజ్ ను సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ అని సలహా ఇచ్చారట. ఇక పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కూడా వెనకాల ఉండి నడిపించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

ఈ మూవీని పీకే క్రియేటివ్ వర్క్స్ నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ తో నటించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు అని చెప్పవచ్చు. సాయి కూడా పవన్ తో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తాడు. ఇప్పటికే ఆచార్య సినిమాతో మెగా ఫ్యాన్స్ కు సెలబ్రేషన్ రాబోతోంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కూడా సెట్టయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ అవుతాయి. మరి ఈ కాంబినేషన్ పై అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటన ఇస్తారో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus