Bro Movie: 100 కోట్లు సాధిస్తే పవన్ మూవీ బ్లాక్ బస్టర్.. టార్గెట్ ఎంతంటే?

పవన్ సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి టక్ వస్తుందో అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్రో మూవీ నాన్ థియేట్రికల్ హక్కులతోనే సగం బడ్జెట్ ను రికవరీ చేయగా థియేట్రికల్ హక్కుల టార్గెట్ 97.5 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. పవన్ రేంజ్ కు ఈ టార్గెట్ ను సునాయాసంగా అందుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భారీ వర్షాలు కురుస్తున్నా హైదరాబాద్ లో బ్రో మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ఏఎంబీ సినిమాస్ లో బ్రో ఫస్ట్ డేట్ టికెట్లు ఇప్పటికే బుక్ కాగా 11 షోలు ప్రదర్శితమవుతున్నాయి. రిలీజ్ సమయానికి షోల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రసాద్ మల్టీప్లెక్స్, ఏఏఏ సినిమాస్ లో సైతం బ్రో మూవీ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. కర్నూలులో ఉదయం 7 గంటల నుంచి బ్రో మూవీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

బ్రో సినిమాకు (Bro Movie) ఏపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని కొంతమంది భావించినా ప్రభుత్వం ఈ సినిమాపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. వైజాగ్ లో అయితే బ్రో సినిమా ఫస్ట్ డే బుకింగ్స్ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. వినోదాయ సిత్తం సినిమాను చూసిన వాళ్లకు సైతం నచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. బ్రో నైజాం హక్కులు 30 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.

ఉత్తరాంధ్ర హక్కులు 19.5 కోట్లు, సీడెడ్ హక్కులు 13 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఏరియాల హక్కులు 17 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోనే బ్రో సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus