వెండితెరపై గుండుతో కనిపిస్తే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత మరొక షాకింగ్ రూమర్ వైరల్ అవుతోంది. పవర్ స్టార్ అభిమానులైతే ఇది అబద్దమవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ సినిమా కోసం పవన్ ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ పనులను పూర్తి చేసిన పవర్ స్టార్ ఆ తరువాత అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక డైరెక్టర్ క్రిష్ తో ఒక పిరియాడిక్ సినిమా కూడా చేయబోతున్న పవన్ కళ్యాణ్

ఆ మూవీలో నెవర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నాడని సమాచారం. వీలైనంత వరకు కమర్షియల్ యాంగిల్ లోనే స్టైలిష్ గా కనిపించే పవన్ మొదటిసారి పిరియాడిక్ కథలో నటిస్తుండడంతో దర్శకుడు క్రిష్ చెప్పిన లుక్ కోసం తనను తాను మార్చుకోవాలని కూడా అనుకుంటున్నాడు. అయితే ఆ సినిమాలో ఒక ఎపిసోడ్ కోసం చివరలో పవన్ కళ్యాణ్ గుండు లుక్ తో కనిపించడానికి ఒప్పుకున్నాడని సమాచారం. దర్శకుడు క్రిష్ ఎలాంటి సినిమా చేసినా అందులో ఎమోషనల్ టచ్ హై డోస్ లో ఉండేలా చూసుకుంటాడు.

Three Pawan Kalyan fans no more of electric shock1

ఇక పవన్ కళ్యాణ్ లాంటి హీరోను అలాంటి లుక్ లో చూపించబోతున్నాడు అంటే ఎదో బలమైన కారణం ఉండే ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus