మాట కోసం పవన్ ఆ పని చేసాడు ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మీద నిలబడేందుకు ఎంత దూరమైనా వెళ్తాడని రీసెంట్ గా ఓ సంఘటన తెలిపింది. ఖర్చులకు డబ్బుల్లేక పవన్ తన మెర్సిడస్ బెంజ్ కార్ అమ్ముకున్నాడని వచ్చిన వార్తలు వెనుక మంచి వాస్తవం దాగుందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అతని కోసం కారు అమ్మలేదని వెల్లడించారు. గతంలో పవర్ స్టార్ చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు అయ్యే ఖర్చు భరిస్తానని మాట ఇచ్చారు. వారికి శస్త్ర చికిత్స జరిగే సమయం దగ్గర పడింది.

అప్పుడు పెద్ద మొత్తంలో అతని వద్ద డబ్బులు లేకపోవడంతో, ఎవరిని అడగడం ఇష్టం లేక సొంత కారుని అమ్మి, వచ్చిన 70 లక్షలు పిల్ల వైద్య ఖర్చులకు ఇచ్చినట్లు సమాచారం. ఇలా అయన సొంత డబ్బులతో ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడారు. నిజజీవితంలోనూ హీరో అనిపించుకున్నారు. ఈ విషయం అయన ఎవరికీ చెప్పలేదు. తన పై నెగిటివ్ వార్తలు వస్తున్నా స్పందించలేదు.  సాయం పొందిన వారి నుంచి కారు అమ్మిన సంగతి వెనుక ఉన్న కారణం తెలుసుకున్న వారందరు పవన్ పై మరింత అభిమానం పెంచుకుంటున్నారు. సినీ హీరోగా ఇష్టపడని వారు సైతం పవన్ లోని మంచి మనిషికి తమ హృదయంలో చోటిస్తున్నారు. ఒక మంచి పని చేయడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరికీ సంజాయిషీ చెప్పుకోనక్కరలేదని ఈ సంఘటన ద్వారా పవర్ స్టార్ నిరూపించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus