Akira Nandan: కర్రసాముతో ఆకట్టుకున్న జూనియర్ పవర్ స్టార్!

  • August 3, 2021 / 06:40 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని సినిమాలలో ఫైట్లు ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా జూనియర్ పవర్ స్టార్ అఖిరా నందన్ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిరా నందన్ తాజాగా కర్ర తిప్పుతూ కసరత్తులు చేయగా రేణు దేశాయ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ కావడంతో పాటు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్ అఖిరా నందన్ లో ఇంత టాలెంట్ ఉందా..? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టైల్ అఖిరా నందన్ లో కనిపిస్తుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిరా వీడియోను చూసి అభిమానులు ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం. అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.

అఖిరా కర్ర తిప్పుతున్న వీడియోకు 50,000కు పైగా లైక్స్ వచ్చాయి. ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం పవన్ కొడుకు టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు. పవన్ కు యూత్ లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా అఖిరా ఎంట్రీకి కొన్నేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అఖిరా నందన్ వయస్సు 17 సంవత్సరాలు కాగా వరుణ్ తేజ్ కంటే ఎత్తు ఉన్న అఖిరా తన హైట్ తో అభిమానులకు షాకిస్తున్నాడు.


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus