వకీల్ సాబ్ కొరకు భారీ పోరాటం చేస్తున్న పవన్
- March 11, 2020 / 06:20 AM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్ రౌడీలను ఇరగదీస్తున్నాడు. మీదకు వస్తున్న భారీ కాయులను సైతం మట్టి కరిపిస్తున్నారు. వివరాల లోకి వెళితే పవన్ కమ్ బ్యాక్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మే నెలలో విడుదల కావాల్సిఉండగా షూటింగ్ చివరి దశకు చేరింది. కాగా ప్రస్తుతం హైదరాబాద్ శివారులో గల అల్యూమినియం ఫ్యాక్టరీ నందు వేసిన ప్రత్యేక సెట్ లో ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు.

ఒరిజినల్ పింక్ మూవీలో ఎటువంటి ఫైట్ సన్నివేశం లేదు. ఐతే పవన్ ఇమేజ్ రీత్యా ఇంటర్వెల్ కి ముందు ఓ భారీ ఫైట్ సన్నివేశం పెట్టడం జరిగిందని సమాచారం. ఆ పోరాట సన్నివేశం ఇప్పుడు చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వేణు శ్రీరామ్ వహిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా నిన్న విడుదలైన మగువా మగువా… లిరికల్ వీడియో మంచి ఆదరణ దక్కించుకుంటుంది.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!













