పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గతేడాది ‘హరిహర వీరమల్లు’ ‘ఓజి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ‘ఓజి’ బాగా ఆడింది. ఫ్యాన్స్ ఆకలి అయితే తీర్చింది. ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రానున్నారు పవన్ కళ్యాణ్. మార్చి 26నే విడుదల కానుంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.
అందువల్ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు హరీష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఇదిలా ఉంటే.. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. సురేందర్ రెడ్డి కూడా మాస్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న దర్శకుడే. కానీ ‘సైరా’ ‘ఏజెంట్’ సినిమాలతో రేసులో వెనుకబడ్డాడు. తిరిగి పుంజుకోవాలంటే ఇప్పుడు అతనికి ఓ హిట్టు కావాలి.
అందుకే తన ఆస్థాన రచయిత వక్కంతం వంశీతో ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయించాడు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఇమాన్వి ఎంపికైనట్టు తెలుస్తుంది. ప్రభాస్- హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ తో ఈమె హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించారట.
‘ఓజి’ తో పవన్ కళ్యాణ్ రూ.285 కోట్ల గ్రాస్ మార్క్ ను కొల్లగొట్టారు. కానీ నిర్మాత రామ్ తళ్ళూరి ఖాతాలో ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా పడలేదు. ఆయన ఇప్పటివరకు 8 సినిమాలు చేస్తే.. అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్ సినిమా కోసం అంత కేటాయించడం అంటే చిన్న విషయం కాదు.