జాతీయ గీతం ఆలపించనున్నపవన్ ?

దేశవ్యాప్తంగా ఉన్న కబడ్డీ ఆటగాళ్లను టీవీకి కట్టి పడేస్తున్న టోర్నమెంట్ ప్రో కబడ్డీ. స్టార్ స్పోర్ట్స్ వారు రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రస్తుతం సీజన్ 4 కొనసాగుతోంది. ఈసారి పీకేఎల్ 4 లీగ్ దశ ముగిసింది. నేడు సెమి ఫైనల్స్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియమ్ లో జరుగనుంది. మార్కుల పట్టికలో మొదటి, నాల్గవ స్థానంలో ఉన్న పాట్నా పైరేట్స్, పుణేరి పల్టాన్ మొదట తలపడనున్నాయి.

ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. అనంతరం రెండవ, మూడవ స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. ఈ సెమి ఫైనల్స్ మ్యాచ్లను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా మన జాతీయగీతం జనగణమనను ఆలపించనున్నారు. ప్రతి మ్యాచ్ ముందు ఒక స్టార్ జాతీయగీతం పాడి గేమ్ ని మొదలు పెట్టడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం.

ఈ సారి సెమీఫైనల్స్ కి మన తెలుగు టైటాన్స్ చేరుకోవడంతో టాలీవుడ్ స్టార్ ని స్టార్ స్పోర్ట్స్ వారు ఆహ్వానించారు. మన పవర్ స్టార్ ని, మనవాళ్ల ఆట ని మిస్ కాకూడదు అంటే మా మూవీస్ ఛానెల్ లో ఈ రోజు 8 గంటలు చూడండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus