పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ గురించి అభిమానులకు పెద్దగా టెన్షన్ ఏమీ ఉండదు కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలు.. ముఖ్యంగా ఇటీవల కాలంలో జనసేనాని ఇంటి వద్ద రెక్కి, హత్యకు సుపారీ ఇచ్చారనే వార్తలతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.. ఇటీవలే పవన్ కొత్తగా నియంచుకున్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వాహనంతో కూడిన పవన్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి..
మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.. ఈ వాహనానికి ‘వారాహి’ అనే పేరు పెట్టారు పవర్ స్టార్.. అయితే ‘వారాహి’ వాహనానికి ఉపయోగించిన ఆలివ్ గ్రీన్ రంగు చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. మిలటరీ వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు ఆలివ్ గ్రీన్ కలర్‌ని ఉపయోగించడానికి అనుమతి లేదని కామెంట్స్ చేస్తుండడంతో.. పవర్ స్టార్ తన స్టైల్లో ఓ పవర్‌ఫుల్ పంచ్ విసురుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే..
ఇక మోటార్ వెహికల్ చట్టం 1989 చాప్టర్ – 121లో ఇండియన్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ తప్ప.. ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ కూడా ఆలివ్ గ్రీన్ కలర్ కలిగిన వాహనాలను వాడకూడదని స్పష్టంగా ఉంది. దీంతో ఇప్పుడు ‘వారాహి’ వాహనం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది..తెలంగాణ రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ అధికారులు కొన్ని కారణాల వల్ల పవన్ వాహన రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశారు.. దీనికి వారు చెప్తున్న ప్రధాన కారణాలు ఏంటంటే..
1) లారీ ఛాసిస్‌ను బస్సుగా మార్చడం.. 2) వాహనం ఎత్తు ఎక్కువగా ఉండడం.. 3) మైన్స్‌లో వాడాల్సిన వెహికల్ టైర్లను రోడ్లపై వాడడం.. 4) ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన ఆలివ్ గ్రీన్ కలర్ అనేది వాహనానికి వాడడం.. ఇవన్నీ నిబంధనలను విరుద్ధంగా ఉండడంతో ‘వారాహి’ రిజిస్ట్రేషన్ తిరస్కరించినట్లు తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగా వాహనాన్ని మార్చుకుని వస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు వెల్లడించారు. దీని గురించి జనసేనాని ఎలా స్పందిస్తారో చూడాలి మరి..
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!