రీమేక్ లకు కేరాఫ్ మారిన పవన్ కళ్యాణ్, వెంకటేష్!

అంతులేని అభిమానులను సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. విక్టరీ వెంకటేష్ ని ఇష్టపడని వ్యక్తి అంటూ ఉండరు. అలాంటి ఇద్దరు మేటి హీరోలపైన ఒక మచ్చ పడుతోంది. అదే రీమేక్ మచ్చ. పవన్, వెంకీలు డైరక్ట్ మూవీలకంటే రీమేక్స్ చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వెంకటేష్ చంటి సినిమాకి ముందు నుంచి మొన్నటి గురు వరకు చేసిన అనేక సినిమాలు ఇతర భాషల్లో విజయం సాధించినవే. మొదట్లో ఫ్రెష్ కథలతో సినిమాలు చేసే  పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ నుంచి రూట్ మార్చారు. పరభాషా కథలపై మోజు పెంచుకుంటున్నారు. ఆయన గత చిత్రం కాటమరాయుడు కూడా తమిళ వీరమ్ కి రీమేక్. మరో అజిత్ మూవీని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు.

అయితే హిందీలో సూపర్ హిట్ అయిన ‘జాలీ ఎల్ఎల్ బీ -2’ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత రాధాకృష్ణ కొన్నారు. ఆయన వెంటనే ఆ కథలో నటించమని వెంకటేష్ ని అడిగినట్లు సమాచారం. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా రాధా కృష్ణ దృష్టిలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈయన బ్యానర్లోనే పవన్ నటిస్తున్నారు. తర్వాత కూడా పవన్ తన బ్యానర్లోనే నటింపజేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకు పవన్, వెంకీతో ఎవరు ఓకే చెప్పినా వారి ఖాతాలో మరో రీమేక్ మూవీ పడనుంది. ఈ విషయం తెలిసి కొంతమంది సినీ అభిమానులు పవన్, వెంకటేష్ లు మారరా? కొత్త కథలతో సినిమాలు తీయరా? అని విమర్శిస్తున్నారు. మరి ఆ స్టార్ హీరోలు ఏమంటారో..!!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus