స్టార్ స్టేటస్ లో పవన్ తో పోటీ పడుతున్న ప్రభాస్!

స్టార్ హీరోల క్రేజ్ లో మార్పు ఉన్నా లేకపోయినా.. వారి పొజిషన్ లో మాత్రం మార్పులు తరచుగా వస్తుంటాయి. ఉదాహరణకి.. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాలకు స్వస్తి పలికిన అనంతరం “నెంబర్ 1” పొజిషన్ దాదాపు ఎనిమిదేళ్లపాటు ఖాళీగానే ఉంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీయార్ లాంటి హీరోలు ఎంతగా ట్రై చేసినా కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. ప్రెజంట్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో ఆ నెంబర్ 1 స్థానం కోసం పోటీపడే స్థాయి ఉన్న కథానాయకులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీయార్, ప్రభాస్, అల్లు అర్జున్. ఈ అయిదుగురిలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న కథానాయకుల్లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ లు ముందువరసలో ఉన్నారు.

అయితే.. ప్రభాస్ కు “బాహుబలి” పుణ్యమా వచ్చిన క్రేజ్ తప్పితే కెరీర్ గ్రాఫ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కానీ.. పవన్ కళ్యాణ్ కెరీర్ గ్రాఫ్ తోపాటు పర్సనల్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది. ఇటీవల సోషల్ మీడియా క్రేజ్ కూడా కథానాయకుల పొజిషన్ ను డిసైడ్ చేస్తుంది. సోషల్ మీడియా ట్రెండింగ్‌ లిస్ట్ ప్రకారం ఈ ఏడాది టాలీవుడ్‌లో నలుగురు స్టార్ హీరోస్‌కు గంట వ్యవధిలోనే లక్షల్లో బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టులు వచ్చాయి. వీరిలో పవన్ మొదటి స్థానంలోనూ.. ప్రభాస్ రెండో స్థానంలోనూ ఉన్నారు. #HBDLEADERPAWANKALYAN అనే హ్యాష్ ట్యాగ్‌తో 2.9 మిలియన్లకు పైగా ట్వీట్స్ రాగా.. ప్రభాస్‌కు #HBDDARLINGPRABHAS హ్యాష్ ట్యాగ్‌తో 2.1 మిలియన్లకు పైగా ట్వీట్స్ వచ్చాయి. #HBDMAHESHBABU హ్యాష్‌ట్యాగ్‌తో దాదాపు 1.1 మిలియన్ల ట్వీట్లతో మహేశ్ బాబు, #HAPPYBIRTHDAYNTR హ్యాష్ ట్యాగ్‌తో దాదాపు 7లక్షల ట్వీట్లతో ఎన్టీఆర్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ఈ లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ క్రేజ్ కు అతి దగ్గరలోనే ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా జరిగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus