పవన్ కళ్యాణ్ సతీమణి చెప్పిన పని చేసిన ఫొటోగ్రాఫర్లు
- November 14, 2016 / 12:44 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటంటేనే కాదు.. అతని సతీమణి మాటకు విలువ ఇచ్చిన సంఘటన రీసెంట్ గా జరిగింది. ఈ అరుదైన సంఘటనకు మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్‌లో జరిగిన హాలోవీన్ పార్టీ వేదికైంది. వివరాల్లోకి వెళ్తే… పవన్ మూడో భార్య అన్నా లెజినోవా మీడియాకు చాలా దూరం. అందుకే ఆమె ఫోటోలు, పిల్లల ఫోటోలు బయటికి రావు. పవన్ ఫ్యాన్స్ కి కూడా ఆమె గురించి పూర్తిగా తెలియదు.
అతి తక్కువ సందర్భాల్లో పబ్లిక్ ఫంక్షన్లకు హాజరయ్యే అన్నా లెజినోవా రెండు రోజుల క్రితం పిల్లల కోసం హాలోవీన్ పార్టీ కి వెళ్లింది. ఆమెను చూడగానే అక్కడి ఫొటోగ్రాఫర్లు చకచకా ఫోటోలు తీశారు. ఆ విషయాన్ని గమనించిన లెజినోవా వారి వద్దకు వెళ్లి తన ఫోటోలను డిలీట్ చేయమని కోరింది. ఆమె ఎంతో మర్యాదగా అడగడంతో ఫోటో గ్రాఫర్లు ఎటువంటి అడ్డు చెప్పకుండా తాము తీసిన లెజినోవా ఫోటోలను తొలగించారు. సినీ పరిశ్రమకు చెందిన ఆమె, సెలెబ్రటీ అయి ఉండి ఫోటోలకు దూరంగా ఉండడం చూసి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారంట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















