Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్!

  • September 1, 2022 / 05:08 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలోదర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతున్నా.. ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. దీని తరువాత ఒప్పుకున్న ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలు సినిమాలు రిలీజ్ కూడా అయిపోయాయి. ‘హరిహర వీరమల్లు’ మాత్రం ముందుకు కదలడం లేదు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ కొత్తగా మరో రెండు సినిమాలు ఒప్పుకున్నారు. అక్టోబర్ నుంచి పొలిటికల్ యాత్రలో బిజీ అవ్వనున్నారు పవన్ కళ్యాణ్.

మరి ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇంకో యాభై శాతం షూటింగ్ పెండింగ్ లో ఉందట. అది కూడా చాలా కీలకమైన యాక్షన్ బ్లాకులని సమాచారం. అవన్నీ చిత్రీకరించడానికి ఎక్కువ సమయమే పడుతుందట. మరి దానికి తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ కేటాయించగలరా..? లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఈ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికీ తెలియడం లేదు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 17వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.180 కోట్ల మేర బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత ఏఎంరత్నం తెలిపారు. మరి చెప్పిన సమయానికి సినిమా వస్తుందో లేదో చూడాలి!

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus