Pawan Kalyan: ‘ఓజీ’ సెట్స్‌ నుండి ఓ ఫొటో లీక్‌.. సినిమా తొలి షెడ్యూల్‌ అదే!

పవన్‌ కల్యాణ్‌ పెద్దగా స్టెప్పులు వేయక్కర్లేదు.. కాస్త అలా నడుచుకుంటూ వస్తే చాలు ఫ్యాన్స్‌.. రికార్డులు హుష్‌. ఈ విషయం ‘అత్తారింటికి దారేది’లో ఓ టీజర్‌ వచ్చినప్పుడు తెలిసిందే. పవన్‌ బ్యాక్‌షాట్‌ను టీజర్‌ పోస్టర్‌గా రిలీజ్‌ చేస్తే లైక్‌లు, కామెంట్లు, రీట్వీట్ల వరద వస్తుంది అని చెప్పడానికి ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ పోస్టర్‌ చాలు. అయితే ఆయన కనిపించకుండా, అసలు సెట్‌లోకే రాకుండా బయటకు వచ్చిన ఓ ఫొటో వైరల్‌ అవుతుందా? ‘ఓజీ’ సినిమా గురించి తెలిస్తే అవుతుంది అనే సమాధానమే వస్తుంది.

డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. (వర్కింగ్‌ టైటిల్‌). మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ట్రయల్‌ షూట్‌ ఇటీవల జరిగిందట. అంటే సినిమాకు సంబంధించి రూపొందిన సెట్‌లో టీమ్‌ ట్రయల్‌ షూట్‌ చేసిందట. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్‌ ఓ పిక్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఇప్పుడది వైరల్‌గా మారింది.

జనవరి 30న ‘ఓజీ’ సినిమా సినిమా ఓపెనింగ్ జరిగింది. ప్రభాస్‌తో ‘సాహో’ లాంటి హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేసిన సుజీత్‌.. ఇప్పుడు పవన్‌తో ఈ సినిమా చేస్తున్నారు.  పవన్‌కు సుజీత్‌ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంతా ఫిక్సయ్యారు. సినిమాటోగ్రాఫర్‌ కె.రవిచంద్రన్ టెస్ట్ షూట్‌లో బిజీగా ఉన్నట్లు చెబుతూ ఓ ఫొటో షేర్‌ చేశారు. దాని బట్టి సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలో అని ఫ్యాన్స్ ఖుష్‌ అవుతున్నారు.

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ షూటింగ్‌ ఇటీవల మొదలైంది. ఈ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే (Pawan Kalyan) పవన్‌ ‘ఓజీ’ స్టార్ట్‌ చేస్తారని టాక్‌. ఇది అయిన వెంటనే ‘హరి హర వీరమల్లు’ ఉంటుందట. మొన్నీమధ్య ‘వినోదాయ చిత్తాం’ షూటింగ్‌ పూర్తి చేశారు. అలా ఒకేసారి సెట్స్‌లో పవన్‌ సినిమాలు నాలుగు ఉండటంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus