‘వకీల్ సాబ్’ .. ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పీక్స్ కు చేరుకునేలా ఉన్నాయి..!

  • March 2, 2020 / 05:28 PM IST

‘అజ్ఞాతవాసి’ వంటి డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా చేస్తే చాలు అంటూ అభిమానులు ఎంతో పడిగాపులు కాసారనే అనే చెప్పాలి. మొత్తానికి వాళ్ళ కోరికని నిర్మాత దిల్ రాజు తీర్చడానికి రెడీ అయిపోయాడు. ఎప్పుడో కాదు ఈ సమ్మర్ కే బొమ్మ పడిపోద్ది.. బాక్సాఫీస్ బద్దలైపోద్ది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే.. తాజాగా విడుదల చేసిన ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్. విడుదలైన కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారిపోయింది ఈ పోస్టర్. ‘పింక్’ రీమేక్ గా రాబోతున్న ఈ ‘వకీల్ సాబ్’ ను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో గడ్డంతో ఉన్న పవన్ కళ్యాణ్.. కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుని పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. వెనుక కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు అనే విషయాన్ని.. ఈ పోస్టర్ లో సింబాలిక్ గా చెప్పారని స్పష్టమవుతుంది. ఈ సమ్మర్ కి ‘వకీల్ సాబ్’ థియేటర్లలో సందడి చేయనున్నాడు కాబట్టి.. నితిన్ చెప్పినట్టు ‘అభిమానులు చొక్కాలు చింపేసుకోవడానికి రెడీ అయిపోవచ్చు’ అన్నట్టే ఉంది ఈ లుక్.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus