పవన్ ఆ సినిమా రీమేక్ చేయబోతున్నాడు!

తమిళంలో అజిత్ హీరోగా నటిచిన ‘వేదాలం’ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే ఆ విషయంపై క్లారిటీ రాలేదు. తాజాగా నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ తో రీమేక్ చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్ కూడా ఈ సినిమా చేయడానికి మక్కువ చూపిస్తున్నాడు.

పవన్ ఇమేజ్ దృష్ట్యా ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వెంటనే ‘వేదాలం’ రీమేక్ చేయనున్నట్లు సమాచారం. ఆర్.టి.నేసన్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. పవన్ కూడా ఆ డైరెక్టర్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో తెరకెక్కించిన ‘జిల్లా’ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యి మంచి విజయాన్నే అందుకుంది.  మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.. చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus