ఆర్ ఎక్స్ 100 బ్యూటీ సంచలన కామెంట్స్!

ధైర్యే సాహసే లక్ష్మి.. అంటుంటారు పెద్దలు. దైర్యంగా సాహసం చేస్తే కాసులు కురుస్తున్నాయని వారి మాట. అందులో వంద శాతం నిజముందని నటి పాయల్ రాజ్ పుత్ విషయంలో మరోసారి రుజువైంది. హిందీలో సీరియల్స్ చేసుకునే ఈ భామ తొలిసారి హీరోయిన్ గా ఆర్ఎక్స్ 100 లో నటించింది. ఇది పాజిటివ్ క్యారెక్టర్ కాదు.. అలాగని సింపుల్ పాత్ర అంతకన్నా కాదు. పేరుకి హీరోయిన్ అయినప్పటికీ ఐటెం గర్ల్ లాగా అందాలు ఆరబోయాలి. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్ ని చేయడానికి అంగీకరించి తొలి విజయం అందుకుంది. రామ్ గోపాల్ వర్మ స్కూల్లో సినిమా పాటలు నేర్చుకున్న యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

పెట్టిన బడ్జెట్ ని రెండురోజుల్లోనే రాబట్టింది. భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది. ఈ విజయంలో ఎక్కువ క్రెడిట్ ని హీరో కార్తికేయ కంటే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కే దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది. “ఎంతో మంది హీరోయిన్లు ఈ పాత్రను నిరాకరించారు. నెగెటివ్ షేడ్ ఉన్న ఇలాంటి డేరింగ్ క్యారెక్టర్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. నాకు ఆ ధైర్యం ఉంది. అందుకే ఏ మాత్రం భయపడకుండా సినిమాకు ఓకే చెప్పాను” అని పాయల్ స్పష్టం చేసింది. ఆ ధైర్యమే ఇప్పుడు ఆమె అనేక అవకాశాలు తెచ్చిపెడుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus