ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. అయితే ఈ మూవీ అప్డేట్ గురించిన వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ఏప్రిల్ 30కు వాయిదా వేసినట్టు సమాచారం.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి” మంచి స్పందనను అందుకుని రికార్డు స్థాయిలో 200 మిలియన్ పైగా వ్యూస్ సాధించింది. దీంతో సెకండ్ సింగిల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. రామ్ చరణ్ ఇంట్రో సాంగ్‌గా రానున్న ఈ పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తారనే వార్తలు వినిపించినా, అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 27న చివర్లో లేదా హోలీ సందర్భంగా మార్చి 3 లేదా 4 న పండుగ సమయానికి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ కావడం మరో హైలైట్. రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కీలక పాత్రలోజగపతిబాబు కనిపించనున్నారు. కాగా ఈ వాలెంటైన్స్ డే కి సెకండ్ సాంగ్ అప్డేట్ లేనట్టే కనిపిస్తుంది. దీంతో మెగా అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, ఈ మధ్యనే రాంచరణ్, ఉపాసన దంపతులకు ఇద్దరు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు బాబు మరొకరు పాప అని చిరంజీవి స్వయంగా తెలియజేసారు.