Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

  • June 4, 2026 / 12:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది'(Peddi) సినిమా ఈరోజు(అనగా జూన్ 4న) విడుదలైంది. నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. మొదటి షోతోనే ‘పెద్ది’ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Peddi

రామ్ చరణ్ పెర్ఫార్మన్స్, బుచ్చిబాబు డైరెక్షన్ వంటి వాటికి ప్రశంసలు దక్కుతున్నాయి. 3 గంటల 9 నిమిషాల రన్ టైంతో ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బాక్సాఫీస్ రన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.

Peddi Movie Review and Rating

ఇదిలా ఉంటే.. ‘పెద్ది’ సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ప్లస్ పాయింట్స్

రామ్ చరణ్

‘పెద్ది’ కి యునానిమస్ ప్లస్ పాయింట్ ఏంటంటే.. డౌట్ లేకుండా రామ్ చరణ్ అనే చెప్పాలి. అతనొక టాప్ స్టార్. అలాంటి స్టార్ ఇలాంటి కథని ఓకే చేయడమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అది ఎందుకు అంటే సినిమా చూడాలి అనే ఆన్సరే ఎక్కువగా చెప్పాల్సి ఉంటుంది. అయితే రామ్ చరణ్ ఈ కథని ఓకే చేయడం ఒక ఎత్తు అయితే.. కేవలం ఒక్క సినిమా అనుభవం కలిగిన దర్శకుడు బుచ్చిబాబుకి సరెండర్ అయిపోయి 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టడం.. కాదు కాదు ప్రాణం పెట్టి పనిచేయడాన్ని కచ్చితంగా అభినందించాల్సిందే. అతని కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. స్క్రీన్ ప్రెజన్స్ దగ్గరనుండి యాక్షన్ సీన్స్, డాన్స్ అన్నిటిలో ది బెస్ట్ ఇచ్చాడు.

జగపతి బాబు

‘పెద్ది’ కథ మొదలయ్యేది.. ముందుకు సాగేది కూడా జగపతి బాబు పోషించిన అప్పల సూరి పాత్ర వల్లే అని చెప్పాలి. ఆయన ఎంత డెడికేటెడ్ గా పనిచేశాడు అంటే.. ఒక సీన్ లో అతన్ని అండర్వేర్ తో పడుకోబెట్టి చితక్కొట్టి బురదలో పారేస్తారు. అలాంటి సీన్ టాలీవుడ్ లో ఉన్న సీనియర్ యాక్టర్స్ చేస్తారా? అంటే డౌటే. కానీ జగపతి బాబు మాత్రం ఎటువంటి ఇగోలకి పోకుండా ఆ సన్నివేశంలో నటించారు. అతని మేకోవర్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగా కుదిరాయి. నో డౌట్ అప్పల సూరి పాత్రకి జగపతి బాబుని కాకుండా వేరే వాళ్ళని ఊహించలేము అంటే అతిశయోక్తి అనిపించుకోదు.

శివరాజ్ కుమార్

ఎక్కడైతే జగపతి బాబు పాత్ర ఎండ్ అయ్యిందో.. అక్కడి నుండి శివరాజ్ కుమార్ పాత్ర టేకాఫ్ అవుతుంది. ఇది కూడా కథని ముందుకు తీసుకెళ్లే పాత్రే. ఆయన లుక్ పవర్ఫుల్ గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆయన మార్క్ చూపించారు.

హాస్పిటల్ సీన్

చివరి 50 నిమిషాలు ‘పెద్ది’ కి ఆయువుపట్టు. ఇందులో భాగంగా వచ్చే హాస్పిటల్ సీన్ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఆ సీన్లో చరణ్ పెర్ఫార్మన్స్ కి తెలీకుండానే కన్నీళ్లు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఆ సీన్ తర్వాత ఆడియన్స్ అంతా సైలెంట్ గా అదే టైంలో అలర్ట్ అయ్యి సినిమాని చూస్తారు.

రెహమాన్ మ్యూజిక్

రెహమాన్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చాలా బాగున్నాయి. విజువల్ గా వాటిని ప్రెజెంట్ చేసిన తీరు కూడా ఆకర్షణీయంగా అనిపిస్తాయి. చరణ్ డాన్స్ మూమెంట్స్ వల్ల అవి మరింత హైలెట్ అవుతాయని చెప్పాలి.

దర్శకుడు బుచ్చిబాబు సానాతో పాటు రైటింగ్ టీం కూడా మంచి ఎఫర్ట్ పెట్టింది. కొన్ని సంభాషణలు ఇన్స్పిరేషన్ గా అనిపిస్తాయి. అలాగే టెక్నికల్ టీం వర్క్ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు.

మైనస్ పాయింట్స్

సినిమా స్టార్టింగ్లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్ల మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంటుంది. అది చాలా ఘోరంగా అనిపిస్తుంది. దానికి ముందు హీరోయిన్ గ్లామర్ ను వర్ణిస్తూ హీరో చెప్పే డైలాగులు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెడతాయి.

హీరో తన తల్లితో పెళ్లి చేయమని అడిగే సన్నివేశం కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ‘తల్లితో కొడుకు ఇలా కూడా మాట్లాడతాడా?’ అనే సెటైర్లు వేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో జగపతి బాబు చెప్పిన డైలాగ్ కూడా సినిమాలో లేకపోవడం గమనార్హం.

‘మిర్జాపూర్’ నటుడు దివ్యెందు శర్మ శర్మ పాత్ర ఇంట్రో బాగుంది. ఆ పాత్రతో ‘మిర్జాపూర్’ సిరీస్ లో ఉన్న ఓ బోల్డ్ డైలాగ్ ను ఇందులో కూడా పలికించారు. అది కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయితే ప్రీ ఇంటర్వెల్ తర్వాత ఈ పాత్రని చూపించరు. క్లైమాక్స్ లో మంచోడుగా మారిపోయినట్టు చూపిస్తారు. సో ఎక్కడో కనెక్టివిటీ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

రావు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి చాలా మంది సీనియర్ నటులు ఈ సినిమాలో నటించారు. వాళ్ళ పాత్రలకి సరైన ఆర్క్స్ లేకపోవడంతో ఆ పాత్రలు ఎందుకు ఉన్నాయా అనే ప్రశ్నలు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి.

రన్ టైం 3 గంటల 9 నిమిషాలు ఉంది. కొంచెం పైన చెప్పుకున్నటువంటి కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేస్తే.. బాగుంటుంది. మరి ఈ విషయంలో చిత్ర బృందం ఆలోచన ఎలా ఉందో మరి.

అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #peddi movie
  • #peddi review
  • #Ram Charan

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

24 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

15 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

19 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

20 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

20 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version