Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 4, 2026 / 06:12 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రామ్‌చ‌ర‌ణ్‌ (Hero)
  • జాన్వీ క‌పూర్‌ (Heroine)
  • శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ త‌దిత‌రులు (Cast)
  • బుచ్చిబాబు సానా (Director)
  • వెంకట సతీష్ కిలారు (Producer)
  • ఏఆర్ రెహ‌మాన్‌ (Music)
  • ఆర్ రత్నవేలు (Cinematography)
  • నవీన్ నూలి (Editor)
  • Release Date : 4th జూన్ 2026
  • వృద్ధి సినిమాస్ (Banner)

సోలో హీరోగా రామ్‌చ‌ర‌ణ్‌ (Ram Charan) హిట్టు అందుకొనిఎనిమిదేళ్లు దాటిపోయింది. క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాతో చేసిన గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు గ‌త సినిమాలు అంత‌గా ఈ మెగా హీరోకు అచ్చి రాలేదు. స‌క్సెస్ కోసం త‌న మాస్ ఇమేజ్‌ను ప‌క్క‌న‌పెట్టి రామ్‌చ‌ర‌ణ్ చేసిన మూవీ పెద్ది (Peddi). స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో జ‌గ‌ప‌తిబాబు, శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో వెంక‌ట స‌తీష్ కిలారు ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది టాలీవుడ్‌లోనే మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో ఒక‌టిగా జూన్ 4న పెద్ది ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పెద్దితో రామ్‌చ‌ర‌ణ్‌కు బుచ్చిబాబు హిట్టు ఇచ్చాడా? స‌రైన స‌క్సెస్ లేక వెళ‌వెళ‌బోతున్న టాలీవుడ్‌ను పెద్ది గ‌ట్టెక్కిస్తుందా? లేదా? అంటే?

Peddi Movie Review

Peddi Movie Review and Rating

క‌థ‌: పెద్ది (రామ్‌చ‌ర‌ణ్‌) ఓ క్రికెట‌ర్‌. బ‌తుకుతెరువు కోసం బెల్లం త‌యారు చేసే ఫ్యాక్ట‌రీలో ప‌నిచేస్తుంటాడు. పెద్ది ఊరికి పేరుతో పాటు రోడ్డు సౌక‌ర్యం ఉండ‌దు. ఆ ఊరివాళ్ల‌కు ఓటుహ‌క్కు లేక‌పోవ‌డంతో అంద‌రూ చుల‌క‌న‌గా చూస్తారు. విజ‌య‌న‌గ‌రం వెళ్లాలంటే కొండ‌లు, వాగులు దాటాల్సివ‌స్తుంది. పెద్ది ఊరి మీదుగానే రైల్వే ట్రాక్ ఉంటుంది. కానీ స్టేష‌న్ లేక‌పోవ‌డంతో ఒక్క ట్రైన్ కూడా ఆగ‌దు. ఊరికి రైల్వే స్టేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని అప్ప‌ల‌సూరి (జ‌గ‌ప‌తిబాబు) ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. పెద్ది గొప్ప క్రికెట‌ర్‌గా విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి ఏరియాల్లో ఫేమ‌స్ అవుతాడు. కానీ అప్ప‌ల‌సూరి మ‌ర‌ణం కార‌ణంగా త‌న‌కు ఇష్ట‌మైన క్రికెట్‌ను వ‌దిలి కుస్తీని ఎంచుకుంటాడు. పెద్ది (Peddi) ఆ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం ఏమిటి? అప్ప‌ల‌సూరి ఎలా చ‌నిపోయాడు? త‌న ఊరితో పాటు జాతికి గుర్తింపు తీసుకురావ‌డానికి పెద్ది ఎలాంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నాడు? కుస్తీలో ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లిన పెద్ది చివ‌ర‌కు ఆట‌కే దూరం కావాల్సిన ప‌రిస్థితి ఎందుకొచ్చింది? త‌న‌ను ప్రేమించిన అచ్చియ‌మ్మ‌ను (జాన్వీక‌పూర్‌) పెద్ది పెళ్లి చేసుకున్నాడా? పెద్దికి అండ‌గా నిలిచిన గౌర్నాయుడు (శివ‌రాజ్‌కుమార్‌) ఎవ‌రు? రామ్‌బుజ్జి(దివ్యేందు శ‌ర్మ‌), వీర‌భ‌ద్రంతో (తార‌క్ పొన్న‌ప్ప‌) పెద్ధి ఎందుకు గొడ‌వ‌లు జ‌రిగాయి? అన్న‌దే మిగిలిన క‌థ‌.

Peddi Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: పెద్ది (Peddi) మూవీ రామ్‌చ‌ర‌ణ్ వ‌న్ మెన్ షోగా నిలిచింది. యాక్టింగ్ ప‌రంగా అత‌డి కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా పెద్ది నిలుస్తుంది. డ్యాన్సుల్లో అద‌ర‌గొట్టాడు. క్రికెట్‌, రెజ్లింగ్ సీన్ల కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ ఆక‌ట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోష‌న‌ల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. హీరోయిజం హంగుల‌కు దూరంగా సాగే ఇలాంటి క్లైమాక్స్‌ను యాక్సెప్ట్ చేయ‌డానికి ధైర్యం కావాలి. చ‌ర‌ణ్ త‌ర్వాత అప్ప‌ల‌సూరి పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ పాత్ర‌కు జ‌గ‌ప‌తిబాబు న్యాయం చేశారు.

స్టైలిష్ యాక్ట‌ర్ అనే ఇమేజ్‌కు భిన్నంగా ఇందులో క‌నిపించారు. గురువు పాత్ర‌కు శివ‌రాజ్‌కుమార్ హుందాత‌నం తీసుకొచ్చారు. పాత్ర‌కు ఎంత కావాలో అంతే న‌టించారు. ఈ సినిమాలో న‌ట‌న ప‌రంగా జాన్వీ క‌పూర్ క్యారెక్ట‌ర్ వీక్‌గా నిలిచింది. కేవ‌లం గ్లామ‌ర్ కోస‌మే ఆమెను వాడుకున్నారు. ఫ‌స్ట్ హాఫ్‌లో కాస్త ఎక్కువే జాన్వీకి స్క్రీన్ స్పేస్ ద‌క్కింది. సెకండాఫ్‌లో అతిథిగా మారిపోయింది. స్పెష‌ల్ సాంగ్‌లో శృతి హాస‌న్ తేలిపోయింది. దివ్యేందు శ‌ర్మ‌, తార‌క్ పొన్న‌ప్ప‌, అజ‌య్ ఘోష్‌, ఉపేంద్ర లిమాయో చాలా మంది టాలెంటెడ్ యాక్ట‌ర్లు ఉన్నా ఎవ‌రిని ద‌ర్శ‌కుడు స‌రిగ్గా వాడుకోలేదు.

Peddi Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: డైరెక్ట‌ర్‌గానే కాకుండా రైట‌ర్‌గా బుచ్చిబాబు సానా మెప్పించారు. తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ను నిజాయితీగా స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు. రామ్‌చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోను బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తాడోన‌ని అభిమానులు సందేహం వ్య‌క్తం చేశారు. ఫ్యాన్స్ కోరుకునే ఎలివేష‌న్లు, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిస్స‌వ్వ‌కుండా చూసుకుంటూనే తాను అనుకున్న క‌థ‌ను ఎలాంటి త‌డ‌బాటు లేకుండా చెప్పారు.

ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు మ‌రో హీరోలా నిలిచారు. రై రై , చికిరి సాంగ్స్ , బీజీఎమ్ బాగున్నాయి. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. క్రికెట్, కుస్తీ సీన్ల‌ను రియ‌ల్‌గా చూసిన ఫీలింగ్ క‌లిగించారు. ఎడిట‌ర్ న‌వీన్ నూలి త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌నిచెబితే బాగుండేది. సినిమా ర‌న్‌టైమ్ కాస్త ఎక్కువైన ఫీలింగ్ క‌లుగుతుంది. నిర్మాత వెంక‌ట స‌తీష్ కిలారు క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డ‌ కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాను తెర‌కెక్కించారు. అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువే ఖ‌ర్చు చేశారు.

Peddi Movie Review and Rating

విశ్లేష‌ణ‌: త‌న ఊరితో పాటు జాతిని గెలిపించ‌డం కోసం ఓ ఆట‌గాడు సాగించిన పోరాటం నేప‌థ్యంలో పెద్ది మూవీని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చాలా వ‌ర‌కు లాజిక్‌ల‌కు దూరంగా సాగుతాయి. క్లైమాక్స్‌లో హీరో గెల‌వ‌డం ఈ జాన‌ర్ సినిమాల్లో కామ‌న్‌గా క‌నిపిస్తుంది. వాటికి భిన్నంగా రియ‌లిస్టిక్‌గా పెద్ది సాగుతుంది. ఇందులో ఒకే ఆట‌ను కాకుండా క్రికెట్‌, రెజ్లింగ్‌తో పాటు ర‌న్నింగ్ గేమ్‌ను చూపించాడు.

ఈ గేమ్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే సీన్లు ఫ్యాన్స్‌ను మంచి కిక్ ఇస్తాయి. ముఖ్యంగా రెజ్లింగ్ సీన్ల‌లో చ‌ర‌ణ్‌లోని హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించాడు డైరెక్ట‌ర్‌. ఇద్ద‌రు రెజ్ల‌ర్ల‌తో ఒకేసారి ఫైట్ చేసే యాక్ష‌న్ ఎపిసోడ్ అదిరిపోయింది. పెద్ది క్లైమాక్స్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటార‌ని చిత్ర‌బృందం ప‌లు ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్‌లో చెబుతూ వ‌చ్చింది. బుచ్చిబాబు కూడా క్లైమాక్స్‌నే ఎక్కువ‌గా న‌మ్ముకున్న‌ట్లుగా క‌నిపించింది. ప‌తాక ఘ‌ట్టాల‌ను ఎమోష‌న‌ల్‌గా రాసుకున్న తీరు బాగుంది. రీసెంట్ టైమ్‌లో వ‌చ్చిన బెస్ట్ క్లైమాక్స్ ఇదే అని చెప్ప‌వ‌చ్చు.

ఫ‌స్ట్ హాఫ్ పెద్ది సినిమాకు బిగ్గెస్ట్‌ మైన‌స్‌గా మారింది. క్రికెట‌ర్‌గా పెద్ది చేసే మ్యాజిక్‌, తండ్రిని ఎలెక్ష‌న్స్‌లో గెలిపించ‌డానికి అచ్చియ‌మ్మ చేసే ప్ర‌య‌త్నాలు అంత‌గా ర‌క్తి క‌ట్ట‌లేదు. క‌థ‌కు సంబంధం లేకుండా టైమ్‌పాస్ వ్య‌వ‌హారంలా ఈ సీన్లు సాగుతాయి.. పెద్ది, అచ్చియ‌మ్మ ల‌వ్‌స్టోరీలో అటుమోటుత‌నం, ఇటు క్యూట్‌నెస్ రెండు మిస్స‌య్యాయి. క‌థ‌లో బ‌ల‌వంతంగా ల‌వ్ ట్రాక్‌ను ఇరికించిన ఫీలింగ్ క‌లుగుతుంది.

అప్ప‌ల‌సూరి మ‌ర‌ణం, రైల్వే పోలీసుల‌తో పెద్ది చేసే ఫైట్ నుంచే బుచ్చిబాబు స‌రైన ట్రాక్‌లో ప‌డ్డాడు.

రెజ్లింగ్ సీన్లు బాగున్నా సాగ‌దీస్తూ వెళ్లారు. ఢిల్లీ ఎపిసోడ్‌లో ఆస‌క్తి లోపించింది. హీరో త‌న ల‌క్ష్యాన్ని ఎలా చేరుకుంటాడ‌న్న దానిలో వావ్ ఫ్యాక్ట‌ర్ క‌నిపించ‌దు. పెద్ది (Peddi) క‌థ‌లో చాలానే లోపాలు ఉన్నాయి. వాటిని త‌న యాక్టింగ్‌తో రామ్‌చ‌ర‌ణ్ క‌వ‌ర్ చేశాడు. బుచ్చిబాబు కూడా చ‌ర‌ణ్ ఇమేజ్‌నే ఎక్కువ‌గా న‌మ్ముకున్నాడు.

Peddi Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: మెగా ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్. రామ్‌చ‌ర‌ణ్ యాక్టింగ్ కోసం చూడొచ్చు.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AR Rahman
  • #Buchi Babu Sana
  • #janhvi kapoor
  • #peddi movie
  • #Ram Charan

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

35 mins ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

4 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

5 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

6 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

6 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version