PellisandaD Collections: దసరా హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘పెళ్ళిసందD’ ..!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పెళ్ళిసందD’. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదల అయ్యింది. కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలు, ట్రైలర్ వంటివి సినిమా పై బజ్ ఏర్పడేలా చేసాయి.ఇక ‘పెళ్ళి సందడి’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా క్రేజ్ ను మొదటి నుండీ వాడుకుంటూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణ వహిస్తూ చేసిన చిత్రం కావడంతో.. దసరా సెలవులకి ఈ చిత్రాన్ని బాగానే చూసారు ప్రేక్షకులు. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి వీకెండ్ ఈ చిత్రం మంచి కలెక్షన్లనే నమోదు చేసింది.

వాటి వివరాలను పరిశీలిస్తే :

నైజాం 1.25 cr
సీడెడ్ 0.88 cr
ఉత్తరాంధ్ర 0.48 cr
ఈస్ట్ 0.23 cr
వెస్ట్ 0.21 cr
గుంటూరు 0.37 cr
కృష్ణా 0.24 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.21 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.06 cr

‘పెళ్ళిసందD’ చిత్రానికి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే ఇందులో చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు అనేది ట్రేడ్ పండితుల సమాచారం. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు గా ఉంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.4.06 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. మరో రూ.1.14 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను సాధించినట్టే..!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus