రాజకీయాల సంగతి అటుంచితే.. సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ చాలా పక్కాగా ఉంటారు అని చెబుతారు. అంటే అడ్వాన్స్‌లు తీసుకున్నాక ఆ నిర్మాత ఏమైపోతే నాకేముంది అనుకోకుండా.. వాళ్లకు వీలైనంత త్వరగా సినిమాలు చేయాలని చూస్తుంటారు. అయితే పవన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుసగా సినిమాలు చేసే పరిస్థితి లేదు. దీంతో అడ్వాన్స్‌లు తీసుకున్న వాళ్లకు పవన్ హ్యాండిస్తున్నారని కొందరు.. ఆ నిర్మాతలకు పవన్ డబ్బులు తిరిగి ఇచ్చేశారని కొందరు అంటున్నారు. కానీ అదేదీ నిజం కాదని ఆదివారం తేలిపోయింది.
ఆదివార ఉదయం హైదరాబాద్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ముహూర్తం జరుపుకుంది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ వర్సెస్ పవన్ అంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం ఆగిపోయింది. త్వరలోనే షూటింగ్ అని చెప్పారు. అయితే ఎప్పుడు మొదలవుతుంది.. ఆ తర్వాత ఏంటి అనేది వేరే విషయం. అయితే దీంతోపాటు మరో విషయం కూడా తెలిసిందే. అదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ల గురించి. పవన్‌తో ‘వినోదాయ చిత్తాం’ అనే సినిమా రీమేక్ చేయాలని వాళ్లు అనుకున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.
ఆ సినిమా కోసం సముద్ర ఖరి రెడీగా ఉన్నారు, త్రివిక్రమ్ ఆ కథను తెలుగీకరించారు, బుర్రా సాయి మాధవ్ మాటలు కూడా రాసేశారని చెబుతారు. కానీ సినిమా అనౌన్స్‌మెంట్ జరగలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని కొందరు, కాదు వేరే హీరోలతో తీస్తారని కొందరు అన్నారు. ఈ నేపథ్యంలో పీపుల్స్ మీడియా వారి దగ్గర పవన్ తీసుకున్న అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేశారని కూడా అన్నారు. అలా పవన్ ఇచ్చిన మాట తప్పారని ఇంకొందరు ఔత్సాహికులు చెప్పుకొచ్చారు.
అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముహూర్తానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హెడ్ వచ్చారు. సినిమా ముహూర్త కార్యక్రమంలో టి.జి. విశ్వప్రసాద్ వచ్చి పాల్గొన్నారు. ఈ క్రమంలో పవన్‌తో మాట్లాడటం కనిపించింది. దీంతో ఇద్దరి మధ్య ఏం జరగలేదని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద పవన్ సినిమా ఉంటుందని తేలిపోయింది. అయితే అనౌన్స్‌మెంట్ అయిపోతే అదో ఆనందం.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!