ఆనంది ఆత్మహత్య.. ఏప్రిల్ పూల్ అనుకున్నారు అందరూ..

మా టి‌వి లో ప్రసారమయ్యే ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా ఆనంది గా బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రత్యూష బెనర్జీ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఏప్రిల్ 1 కావడం తో ఈ వార్త ఏప్రిల్ పూల్ అనుకున్నారు అందరూ. అయితే ముంబై లోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు ఆమె నిజంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించడంతో బాలీవుడ్ చిత్ర వర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. జంషెడ్ పూర్ కు చెందిన ఈ నటి.. తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తో గత కొంతకాలం గా ఉన్న విభేధాల కారణంగానే ఆమె ముంబై లోని బంగూర్ నగర్ లో ఉన్న తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఆమె ‘బిగ్ బాస్’, ‘జలక్ దిక్ లాజా’, వంటి రియాలిటీ షోల్లో కూడా ఆమె పాల్గొంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus