ఏపీ మంత్రి పేర్ని నాని అధ్యక్షతన సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి అంటే సీఎం జగన్ కు ఎంతో గౌరవమని పేర్ని నాని అన్నారు. త్వరలోనే ప్రజలకు ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా వినోదం పంచుతామని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలకు జగన్ సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందని పేర్ని నాని వెల్లడించారు.
తాజా సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టికెట్ రేట్ల గురించి చర్చించామని పేర్ని నాని చెప్పుకొచ్చారు. పారదర్శకతతో కూడిన టికెట్ రేట్లను అమలు చేస్తామని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని పేర్ని నాని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు అనేక విషయాలను తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్ని నాని వెల్లడించారు. ఈ సమావేశంలో బెనిఫిట్ షోల గురించి ఎవరూ అడగలేదని పేర్ని నాని కామెంట్లు చేశారు. చిరంజీవిని సీఎం జగన్ సోదర భావంతో చూస్తారని పేర్ని నాని చెప్పుకొచ్చారు.
నిర్మాత ఆది శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ రేట్ల సవరణ గురించి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. థియేటర్ సెక్టార్ ను బ్రతికించుకుంటే మాత్రమే మిగిలిన వాళ్లు బ్రతుకుతారని ఆది శేషగిరిరావు చెప్పుకొచ్చారు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అన్ని విషయాలలో అండగా నిలిచిందని తెలిపారు. అర్జీ పెట్టుకుంటే బెనిఫిట్ షోలకు అనుమతి లభిస్తుందని భావిస్తున్నానని సి కళ్యాణ్ అన్నారు.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?