Brahmanandam: ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ… క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం.. ఏం చెప్పారంటే?

పది సెకన్ల వీడియోలో కనిపించింది, చూసింది నమ్మేసి.. తమకు నచ్చినట్లుగా మిగిలిన సీన్‌ని ఊహించేసుకుంటున్న నెటిజన్లు ఉన్న రోజులివీ. అందుకే పది నిమిషాల వీడియోలో ఓ పది సెకన్ల క్లిప్‌లు కట్‌ చేసి వైరల్‌ చేసేస్తున్నారు. అలా బ్రహ్మానందానికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఫొటో అడగ్గా, ఇప్పుడు కాదంటూ బ్రహ్మానందం వెళ్లిపోయిన వీడియో అది. మీరు కూడా ఆ వీడియో చూసే ఉండొచ్చు. ఈ క్రమంలో బ్రహ్మానందంపై సోషల్‌ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.

Brahmanandam

ప్రముఖ నటుడు మోహన్ బాబు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఇటీవల ఓ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలా కార్యక్రమానికి హాజరవుతున్న క్రమంలో బ్రహ్మానందానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎదురుపడ్డారు. ఫొటో దిగుదామని ఎర్రబెల్లి కోరగా, బ్రహ్మానందం తిరస్కరిస్తూ వెళ్లిపోవడం వీడియోల్లో బయటకు వచ్చింది. అయితే తమ మధ్య ఉన్న చనువుతోనే అలా చేసినట్లు బ్రహ్మీ తన క్లారిటీలో చెప్పుకొచ్చారు.

ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే ఓ వీడియో చూసి నవ్వుకున్నాను. మోహన్‌బాబు ఫంక్షన్‌కు లేటవడంతో హడావుడిగా వెళ్తున్నా. అంతలో దయన్న ఎదురయ్యాడు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఇంతలో ‘ఫొటో తీసుకుందాం’ అని అడిగారు. నేను వద్దంటూ లోపలికి వెళ్లిపోయాను. ఆ సన్నివేశాన్ని కొంతమంది అపార్థం చేసుకున్నారు. దయాకర్‌తో నాకు 30 ఏళ్ల బంధం ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆయనతో ఉన్న చనువుతోనే ‘ఉండండి’ అంటూ ముందుకు వెళ్లిపోయాను అని బ్రహ్మానందం చెప్పారు.

అయితే నేనేదో కావాలని దయన్నను తోసేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత నేను, ఆయన కలసి మాట్లాడుకున్నాం అనే విషయం విమర్శిస్తున్నవారికి తెలియదు. ఈ రోజు ఉదయం ఆ వీడియో చూడగానే ఇద్దరం నవ్వుకున్నాం. ‘అన్నా తప్పుగా అర్థం చేసుకున్నారు’ అంటూ ఆయన నాతో మాట్లాడారు. అందుకే ఇందులో అపార్థాలకు తావులేదని స్పష్టత ఇవ్వలనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి అని బ్రహ్మానందం తెలిపారు.

‘అఖండ 2’ బాక్సాఫీస్.. మరో డేరింగ్ స్టెప్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus