బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమా సెప్టెంబర్ 21 న థియేటర్లోకి రానుంది. ఎన్టీఆర్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బలం, బలహీనతలను పరిశీలిస్తే..
బలాలు
టైటిల్జై లవకుశ అనే టైటిల్ కి తెలుగు ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యారు. పైగా కుటుంబ సభ్యులందరూ చూసే చిత్రంగా టైటిల్ స్పష్టం చేసింది.
మూడు క్యారెక్టర్స్జై లవకుశకు ఎన్టీఆర్ ప్రధాన బలం. అందులోనూ మూడు పాత్రలు. ఇప్పటివరకు ఎన్టీఆర్ ను మూడు పాత్రల్లో ప్రేక్షకులు చూడలేదు, కాబట్టి మొదటి సారి ఎన్టీఆర్ ఎలా చేసాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.
కామెడీఅదుర్స్ సినిమాలో చారి పాత్ర నవ్వులు పూయించినట్లుగా ఇందులో లవకుమార్ మంచితనంతో, భయంతో కామెడీ పండించాడు.
నేపథ్య సంగీతందేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు క్యాచీగా లేకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోసేలా ఉందని టాక్.
బలహీనత
డైరక్టర్భారీ కథలను డీల్ చేసే శక్తి బాబీ కి లేదనేది పరిశ్రమల వర్గాల టాక్. ఆ విషయాన్నీ ఆయన గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ నిరూపించింది. మరి జై లవకుశ ని సరిగ్గా డీల్ చేశాడా? లేదా ? అనే అనుమానం ఉంది. ఇది మినహా సినిమాలో ఎటువంటి మైనస్ లు కనిపించడం లేదు. అత్యధిక శాతం సినిమా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.