ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సినిమాలు పైరసీ పాలవ్వకుండా ఆపలేకపోతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్లు అదిరే అభి, గడ్డం నవీన్ కలిసి నటించిన ‘పాయింట్ బ్లాంక్’ సినిమాను కూడా ఇలానే లీక్ చేయడంతో గడ్డం నవీన్ పోలీసులను ఆశ్రయించారు. ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన ‘పాయింట్ బ్లాంక్’ సినిమా కొని రోజుల్లో విడుదల కానుండగా.. ఇంతలో సైబర్ నేరగాళ్లు సినిమాను పైరసీ చేశారు. పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ లో సినిమాను అప్లోడ్ చేశారు.
ఈ విషయంలో తెలుసుకున్న దర్శకనిర్మాతలతో పాటు కమెడియన్ గడ్డం నవీన్ సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు. ఎంతో కష్టపడి తీసిన సినిమాను ఆన్లైన్ లో లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా ప్రింట్ ను ఆన్లైన్ నుండి తీయించాలని పోలీసులను రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమా విడుదల హక్కులను అమెజాన్ ప్రైమ్, ఆహా యాప్ లకు ఇచ్చారు. ఫారెన్ లో ఈ సినిమాను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది.
అక్కడి నుండి డౌన్ లోడ్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ సినిమాను విడుదల చేశాయి. మరో వారంలో సినిమా విడుదల కావాల్సి ఉందనగా.. ఇప్పుడు పైరసీ కావడంతో విడుదలను వాయిదా వేశారు.