Bigg Boss Contestant: చిక్కుల్లో పడ్డ బిగ్ బాస్ కంటెస్టెంట్..!

Ad not loaded.

‘బిగ్ బాస్’ షోకి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది.నార్త్ లో అంటే బాలీవుడ్లో మొదలైన ఈ షో విపరీతమైన జనాదరణ పొందింది. అక్కడ మొదటి నుండి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొనే ప్రతి కంటెస్టెంట్ బాగా పాపులర్ అవుతూ ఉంటారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ ఇషితా గుప్త.. బిగ్ బాస్ – 16 కంటెస్టెంట్ పై పోలీసులకు కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

విషయంలోకి వెళితే..(Bigg Boss Contestant) ‘బిగ్ బాస్ – 16’ లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొంది ప్రియాంక చాహర్ చౌదరి. ఈ షో ద్వారా ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ప్రియాంక చాహర్ పై బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఇషితా గుప్తా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే.. ప్రియాంక ఎంతో కష్టపడి రూపొందించిన డిజైన్లను ప్రియాంక చాహార్ చౌదరీ కాపీ కొట్టిందని ఆరోపిస్తూ ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన ఓ షోలో తనకు తెలియకుండానే తాను డిజైన్ చేసిన డ్రెస్ లను ప్రదర్శించినట్లు ఆమె కంప్లైంట్ లో పేర్కొంది.

ఇదే విషయాన్ని ఇషిక ఆమె తన ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేసింది. ‘ప్రియాంక చౌదరి ధరించిన డిజైన్స్ ఓ ఫ్యాషన్ లైన్ కోసం రూపొందించాము. ఆమె ధరించిన డిజైన్స్ న్యూయార్క్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రెడీ చేయడం జరిగింది’ అంటూ ఇషిత చెప్పుకొచ్చింది. ఇషితా గుప్తా చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక చౌదరి ఎలా స్పందిస్తుంది అనేది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus