PS1: ‘పొన్నియన్ సెల్వన్ – 1’ (తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • September 30, 2022 / 05:04 PM IST

ఇండియన్ సినిమా గర్వించదగ్గ ఫిలిం మేకర్స్ లో మణిరత్నం కూడా ఒకరు. 4 దశాబ్దాలుగా ఆయన తెరకెక్కించాలని కలలు కంటూ చివరికి నానా తిప్పలు పడి తీసిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. దీని మొదటి భాగాన్ని ‘పీఎస్-1’ గా సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించడంతో సినిమా పై బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు కలిసి ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్టుని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మించారు.

తమిళ్‌ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో విడుదల కాబోతుంది ఈ మూవీ. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడం కూడా ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడడానికి కారణం అని చెప్పొచ్చు. అందుకే తెలుగులో ఈ మూవీకి పర్వాలేదు అనిపించే విధంగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 2.20 cr
సీడెడ్ 1.85 cr
ఉత్తరాంధ్ర 1.10 cr
ఈస్ట్ 0.36 cr
వెస్ట్ 0.32 cr
గుంటూరు 0.60 cr
కృష్ణా 0.75 cr
నెల్లూరు 0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.48 cr

‘పొన్నియన్ సెల్వన్ – 1’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.8.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపిస్తున్నాయి. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus