స్టార్ డైరెక్టర్ పై పూజా హెగ్డే కామెంట్స్ వైరల్..!

  • March 15, 2021 / 05:33 PM IST

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ.. ‘రాధే శ్యామ్’ లో హీరోయిన్ గా నటిస్తుంది పూజా హెగ్డే. దీంతో పాటు అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో కూడా నటిస్తుంది. అంతేకాదు తెలుగు సినిమాలతో పాటు తమిళంలో అలాగే బాలీవుడ్లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే ఎక్కువగా ఈ అమ్మడు బాలీవుడ్ వైపే మక్కువ చూపిస్తున్నట్టు స్పష్టమవుతుంది. అక్కడి దర్శకనిర్మాతలను ఆకర్షించడం కోసం ఇప్పటికే పలు గ్లామరస్ ఫోటో షూట్లలో పాల్గొంటున్న ఈ అమ్మడు..

దాంతో వర్కౌట్ అవ్వదు అనుకుని భావిస్తుందనుకుంట. ఇప్పుడు ఏకంగా దర్శకులను ఐస్ చేసే పనిలో కూడా పడినట్టు స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి పుట్టినరోజు కావడంతో పూజా కొంచెం స్పెషల్ గా విషెస్ చెప్పింది.ఆమె రోహిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ… ‘లాస్ట్ ఇయర్ ‘సర్కస్’ మూవీ షూటింగ్ మొదలైంది. ఓ షెడ్యూల్లో కూడా అవ్వకుండానే రోహిత్ నన్ను ఓ ఫ్యామిలీ మెంబెర్ లా చూసారు.

‘మోస్ట్ కూలెస్ట్, కైండెస్ట్, డైరెక్టర్..’ అంటూ రోహిత్ శెట్టి గురించి చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘నేను మీ మూవీస్ కి పెద్ద ఫ్యాన్. 2021లో మీకు సంతోషంతో పాటు బ్లాక్ బస్టర్స్ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హిందీలో కూడా ఈమె రెండు సినిమాల్లో నటిస్తుంది.


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus