Pooja Hegde: ప్రభాస్ ప్రత్యేకత అదే అంటున్న పూజా హెగ్డే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డేకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ మూడున్నర కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది పూజా హెగ్డే నటించిన ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. రాధేశ్యామ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన పూజా హెగ్డే ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ లో ప్రేరణ పాత్ర లైఫ్ ను ప్రతిరోజూ ఆస్వాదించాలని అనుకుంటుందని కెరీర్ లో ఇలాంటి రోల్ లో నటించడం ఇదే తొలిసారని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ పాత్ర ఎన్నో భావోద్వేగాలు ఉన్న పాత్ర అని ఆమె కామెంట్లు చేశారు. భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కిందని పూజా హెగ్డే వెల్లడించారు. రాధేశ్యామ్ లో ఎమోషనల్ సీన్స్ చేసే సమయంలో నిజంగానే నేను ఏడ్చేశానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ హిందీలో కూడా తెరకెక్కడంతో ఎమోషనల్ సీన్స్ కోసం మళ్లీ ఏడవాలా అని తాను అన్నానని పూజా హెగ్డే కామెంట్లు చేశారు. తాను నటించిన హీరోలలో తారక్ కు భాషపై పట్టు ఎక్కువని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.

తారక్ సెట్ లో బాగా సందడి చేస్తారని ఆమె కామెంట్లు చేశారు. ప్రభాస్ షూటింగ్ సమయంలో అందరితో కలిసిపోతారని ప్రభాస్ ప్రత్యేకత ఇదేనని ఇద్దరి హైట్ మ్యాచ్ కావడంతో జంట బాగుందని కామెంట్లు వస్తున్నాయని పూజా హెగ్డే అన్నారు. ప్రభాస్ పెళ్లెందుకు చేసుకోలేదని అందరూ అడుగుతున్నారని షూటింగ్ లో భాగంగా తాను అభిమానుల తరపున ప్రభాస్ ను ఆ ప్రశ్న అడిగానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.

టైటానిక్ కు రాధేశ్యామ్ కు ఎక్కడా పోలికలు ఉండవని అయితే ఆ సినిమాతో రాధేశ్యామ్ ను పోల్చడం సంతోషాన్ని కలిగిస్తోందని పూజా హెగ్డే వెల్లడించారు. తాను జ్యోతిష్యాన్ని నమ్ముతానని 2022 సంవత్సరం తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus