గత కొన్ని నెలలుగా ప్రభాస్ పూజా హెగ్డే మధ్య మాటలు లేవని ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే, ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో కూడా వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతోందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుండటం గమనార్హం. నిజానికి స్టార్ హీరో ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రభాస్ తో పని చేసిన హీరోయిన్లు కూడా ప్రభాస్ గురించి మంచిగా, గొప్పగా చెబుతుంటారు.
తాజాగా పూజా హెగ్డేకు ఈ గొడవలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు పూజా హెగ్డే స్పందిస్తూ ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని అన్నారు. ప్రభాస్ తో రాధేశ్యామ్ లో కలిసి నటించడం తన లక్ గా భావిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ లో నటించిన రోజులన్నీ అద్భుతమని ఆమె కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన రూమర్లలో ఏ మాత్రం నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రభాస్ ఇంట్లో చేసిన వంటకాలను తన అమ్మ కోసం కూడా పంపారని పూజా హెగ్డే కామెంట్లు చేశారు. ఆధారాలు లేకుండా వార్తలను ప్రచారం చేయవద్దని బుట్టబొమ్మ పూజా హెగ్డే కోరారు. పూజా హెగ్డే క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ కూడా ఈ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే చెప్పేశారు. రాధేశ్యామ్ సినిమా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా మరో రెండు రోజుల్లో ఈ సినిమా ఫలితం తేలిపోనుంది.
ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుండగా బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!