ప్రభాస్ సినిమా చేశాకే… పవన్ సంగతి ఆలోచిస్తుందట..!

  • January 18, 2020 / 04:20 PM IST

అసలు పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాను అని ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ మరోపక్క పనులన్నీ చక చకా జరిగిపోతున్నాయి. అవును ఈనెల 20 నుండీ ‘పింక్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే ఫిబ్రవరి నుండీ పవన్ షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. ఈ చిత్రం కోసం పవన్ 25 రోజులు కాల్షీట్లు ఇచ్చాడట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం పూజా హెగ్డే ను అడిగారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్దే. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కూడా నటిస్తున్న ఈ బ్యూటీ .. ఇప్పటి వరకూ ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ 20 సినిమా రెగ్యులర్ షూటింగ్ లో బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో పవన్ సినిమా కోసం సంప్రదించగా.. ప్రభాస్ సినిమాలో తన భాగం పూర్తయ్యాక చూస్తాను అని చెప్పిందట.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus