పూజా హెగ్దే స్టార్ స్టేటస్ అలాంటిది మరి..?

మామూలుగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మ్యాగ్జిమమ్ పదేళ్లు.. ఆ పీరియడ్ కూడా దాటరంటే అది లక్ అనే చెప్పుకోవాలి. అందుకే హీరోయిన్లు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఎడాపెడా సినిమాలు, మాల్స్ ఓపెనింగ్‌లు, ఐటెం సాంగులు, ఎండార్స్‌మెంట్లు చేసి చేతి నిండా సంపాదించుకుంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే సూక్తి నటీమణులకు సరిగ్గా సరిపోతుంది. ఇక అసలు మ్యాటర్‌లోకి వస్తే.. మొదట్లో ఐరన్ గార్ల్‌గా ముద్రపడి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌ జనాల చేత ట్రోలింగ్‌కు గురైంది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.

అయితే ఇప్పుడు లక్ కలిసి రావడంతో టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస విజయాలను అందుకుంటోంది. సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో పాటు భామల కొరత టాలీవుడ్‌లో స్పష్టంగా కనిపిస్తుండటంతో దర్శక నిర్మాతలు ఇప్పుడు పూజా గుమ్మం తొక్కుతున్నారు. ఆమె రెమ్యూనరేషన్‌గా ఎంత అడిగితే అంత ముట్టజెబుతున్నారు. బాలీవుడ్‌లో ఇటీవల హౌజ్‌ఫుల్ 4తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న పూజా హెగ్డే, తెలుగులో అల వైకుంఠపురంతో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉంది. ప్రస్తుతం పూజ అఖిల్‌ సరసన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీకి సంబంధించి లేటేస్ట్‌గా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు గాను పూజ భారీ పారితోషికాన్ని అందుకున్నట్లుగా ఫిలింనగర్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతంటే హీరో అఖిల్ కంటే ఎక్కువ మొత్తంగా తెలుస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు సరైన బ్రేక్ లేని అఖిల్‌తో నిర్మాతలు రెమ్యూనరేషన్ విషయంగా ఒక ఒప్పందం చేసుకున్నారట. సినిమా మొదలైన తర్వాత కేవలం కోటి రూపాయల చెక్ ఇచ్చి.. రిజల్ట్‌ని బట్టి తర్వాతి రెమ్యూనరేషన్ ఉంటుందని చెప్పినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పూజకు మాత్రం కోటిన్నర వరకు అందినట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా సక్సెస్ అయితే ఇంకాస్త దక్కే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న బొమ్మరిల్లు భాస్కర్.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ కో బ్యానర్ జీఏ2 ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Most Recommended Video


నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus