Pooja Hegde: ఆచార్య మూవీని ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా?

Advertisement

ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో హీరోయిన్ పూజా హెగ్డేను కూడా కొంతమంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్, బీస్ట్ సినిమాలు ఫ్లాప్ కాగా ఆచార్య మూవీతో పూజా హెగ్డే ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాపులు చేరాయి. ఈ సినిమాలో నీలాంబరి పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో పాటు ఈ పాత్రకు ప్రాధాన్యత లేదు. సినిమాలో ఈ పాత్ర లేకపోయినా సినిమాకు ఎలాంటి నష్టం జరిగేది కాదని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు.

అయితే పూజా హెగ్డే పోషించిన పాత్రలో నటించే అవకాశం మొదట రష్మికకు వచ్చిందని అయితే రష్మిక ఆ అవకాశాన్ని సున్నితంగా వదులుకున్నారని సమాచారం. ఒకవేళ రష్మిక ఈ ఆఫర్ కు ఓకే చెప్పి ఉంటే మాత్రం రష్మిక ఖాతాలో మరో ఫ్లాప్ చేరి ఉండేది. పూజా హెగ్డే కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే తర్వాత సినిమాలు కూడా ఫ్లాపైతే ఆమె కెరీర్ విషయంలో నష్టపోయే అవకాశం ఉందని చెప్పవచ్చు.

అదే సమయంలో పూజా హెగ్డేకు కొత్త ఆఫర్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపైనే పూజా హెగ్డే ప్రస్తుతం ఆశలు పెట్టుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ సినిమా ముందు వరకు గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.

కానీ రాధేశ్యామ్ సినిమా నుంచి పూజా హెగ్డే జాతకం మాత్రం మారిపోయిందని చెప్పాలి. పూజా హెగ్డేకు గట్టి పోటీని ఇస్తున్న రష్మికకు వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. 2022 సంవత్సరంలో అటు పూజా హెగ్డేకు ఇటు రష్మికకు కలిసిరావడం లేదు. కృతిశెట్టి మాత్రం వరుస విజయాలతో జోరు చూపిస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus