పలు టీవీ కమర్సియల్స్ చేసి ‘భమ్ బోలేనాధ్’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది పూజ ఝవేరి. రెండో చిత్రమైన ‘రైట్ రైట్’లో సుమంత్ అశ్విన్ కి జంటగా నటించిన పూజ ధనుష్ హీరోగా వచ్చిన ‘తొడరి’ (తెలుగులో రైల్) సినిమాతో కోలీవుడ్ లోను అడుగుపెట్టింది. ఇటీవల తెరమీదికొచ్చిన ‘ఎల్ 7’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన పూజలో నటనే గాక అదనపు హంగులు మరెన్నో ఉన్నాయి.
చిన్నతనం నుండే నృత్యం పట్ల మక్కువ కలిగిన పూజ ఝవేరి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ అనుభవంతోనే త్వరలో ఓ బాలీవుడ్ సినిమాకి నృత్య రీతులు సమకూర్చేందుకు సన్నద్ధమవుతోంది. సినిమాల్లోకి రాకముందు “జన్ కార్” పేరిట డాన్స్ అకాడమీ స్థాపించి దాదాపు వెయ్యి మందికి శిక్షణ ఇచ్చింది ఈ గుజరాతీ సోయగం. నటిగా మారక ఈ అకాడమీ తలుపులు మూసేసిన పూజకు గ్రాఫిక్ డిజైనర్ కూడా. భవిష్యత్తులో మెగాఫోన్ కూడా పడతానని నమ్మకంగా చెబుతున్న పూజ తమిళంలో అథర్వ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ద్వారక’తో ఈ ఏడాదిలోనే మరోమారు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.