పూనమ్ కౌర్.. ఈమె సినిమాలతో తెచ్చుకున్న క్రేజ్ కంటే.. సోషల్ మీడియా ద్వారా తెచ్చుకున్న పాపులారిటీ ఎక్కువని చెప్పాలి. ‘మాయాజాలం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘వినాయకుడు’ ‘గణేష్ జస్ట్ గణేష్’ ‘ఒక వి చిత్రం’ ‘శౌర్యం’ ‘నాగవల్లి’ వంటి చిత్రాల్లో నటించింది కానీ అనుకున్నంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. దాంతో తరువాత ఈమెకు అవకాశాలు కూడా ఎక్కువ రాలేదు. ‘శ్రీనివాస కళ్యాణం’ ‘నెక్స్ట్ ఏంటి?’ వంటి చిత్రాల్లో నటించింది కానీ.. అవి కూడా ప్లాపవ్వడంతో ఈమెను పట్టించుకునే వారే లేరు.
అయితే గతంలో పవన్ కళ్యాణ్ పై రకరకాల సెటైర్లు వేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి.. ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇందులో భాగంగా పూనమ్ కౌర్ కూడా పరోక్షంగా విషెస్ చెప్పింది. ‘ఎదిగే వయసులో అనేక కారణాల వల్ల ప్రేమకు దూరమయ్యాడు.
చిన్నప్పటి నుండీ పెద్దయ్యేంత వరకూ.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నాను…! స్వర్గంలో ఉన్న అతని తాతగారి ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్’ అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ కు విషెస్ చెప్పిందా.. లేక ఇండైరెక్ట్ గా అతన్ని దూరం పెట్టిన నందమూరి కుటుంబ సభ్యుల పై సెటైర్లు వేసిందా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అసలు ఎన్టీఆర్ పై ఈమె ఎందుకు ఫోకస్ పెట్టింది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్