Poorna: పూర్ణ ధరించిన బంగారు ఆభరాల గురించి ఆసక్తికర విషయాలు..

  • October 26, 2022 / 05:52 PM IST

యాక్ట్రెస్ పూర్ణ అలియాస్ షామ్నా కాసిం వివాహం దుబాయ్‌కి చెందిన బిజినెస్ మెన్ షానిద్ ఆసిఫ్ అలీతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సమక్షంలో, ముస్లిం సాంప్రదాయంలో, అరబిక్ పద్ధతిలో జరిగిన పూర్ణ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివాహ బంధంతో ఒక్కటైన పూర్ణ దంపతులకు సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. పూర్ణ వెడ్డింగ్‌కి సంబంధించిన పలు విషయాల గురించి ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.

సాంప్రదాయమైన చీరకట్టులో, మెడలో బంగారు ఆభరణాలు ధరించి మెరిసిపోయింది పూర్ణ. ఒంటినిండా భారీగా బంగారం ధరించడంతో అసలు ఆమె వేసుకున్న బంగారం ఎంత అనే హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లికి పూర్ణ ధరించిన బంగారు ఆభరణాలను ఆమె భర్త కానుకగా ఇచ్చాడట. ఆ జువెలరీ అంతా కలిపితే దాదాపు 1700 గ్రాములు (170 తులాలు) అట. ఈ బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లాను కూడా పూర్ణకు ఆమె భర్త గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలుస్తోంది.

పెళ్లికి ఊహించని అపురూపమైన కానుకలిచ్చి తనను సర్‌ప్రైజ్ చేసిన భర్తకు థ్యాంక్స్ తెలిపింది పూర్ణ. సినిమాలతో పాటు రియాలిటీ షో జడ్జిగానూ అలరించిన పూర్ణ.. మాతృభాష మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలయ్య, బోయపాటిల బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ఆమె చేసిన క్యారెక్టర్‌కి మంచి పేరొచ్చింది.

పెళ్లి, హనీమూన్ లాంటి వెకేషన్ కారణంగా కొన్ని రోజులు ప్రొఫెషన్‌కి గ్యాప్ రావడం అనేది కామనే. కాకపోతే పెళ్లి తర్వాత పూర్ణ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తేందా? లేక పర్సనల్ లైఫ్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చి.. భర్తతోపాటు దుబాయ్‌లో సెటిలైపోతుందో చూడాలి మరి..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus