అక్రమ సంబంధాల కాన్సెప్ట్ తో తెరకెక్కిన పూర్ణ ‘బ్యాక్ డోర్’ మూవీ.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో

  • May 31, 2023 / 12:14 AM IST

ఓటీటీలో కంటెంట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కే చిత్రాలకు, బోల్డ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. హీరోయిన్ పూర్ణ నటించిన ‘బ్యాక్ డోర్’ సినిమా 2021 చివర్లో థియేటర్లోకి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

ఆర్చిడ్ ఫిల్మ్ స్టూడియోస్ బ్యానర్ మీద బి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో పూర్ణ సరసన కొత్త హీరో తేజ నటించారు. రెండే రెండు పాత్రలతో, ఆడవాళ్ళ మనోభావాల్ని, కుటుంబ విలువల్ని, భార్యాభర్తల సంబంధాల్ని, అక్రమ సంబంధాలు వల్ల వచ్చే నష్టాన్ని ఈ చిత్రంలో చూపించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus