విజయ్ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్న వాణి భోజన్..!

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 31 విడుదల కాబోతుంది. ఈ చిత్రం తరువాత క్రాంతి మాధవ్ డైరెక్షన్లో చేయబోయే చిత్రాన్ని కూడా మొదలుపెట్టేశాడు విజయ్. ఇక దీని తరువాత మరో రెండు చిత్రాలు ఫైనలైజ్ చేసాడు. ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే… మరో పక్క యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా విజయ్ త్వరలోనే నిర్మాతగా కూడా మారబోతున్నాడని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే పేరుతో ఓ బ్యానర్ ను స్థాపించి.. చిన్న సినిమాల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాడు.

ఇక ఈ బ్యానర్ పై రూపొందించే మొదటి చిత్రానికి హీరో హీరోయిన్లుగా దర్శకుడు తరుణ్ భాస్కర్ , హాట్ యాంకర్ అనసూయ లను ఎంచుకున్నాడు. ఇక మరో కీలక పాత్రకోసం తమిళ టీవీ నటి వాణి భోజన్ ను కూడా తీసుకున్నాడని తాజా సమాచారం. తమిళ టీవీ సీరియల్స్ ద్వారా వాణి కి అక్కడి బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇందుకోసమే ఈ అమ్మాయిని తీసుకున్నాడంట మన రౌడీ. ఈ చిత్రం ద్వారా షమ్మీర్ అనే యువ దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్.. అప్పుడే తుది దశకు చేరుకుందని సమాచారం. మరి నిర్మాతగా విజయ్ దేవరకొండ ఎలాంటి హిట్టందుకుంటాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus