త్రివిక్రమ్ గురించి పోసాని కృష్ణ మురళి చెప్పిన సంగతులు

పోసాని కృష్ణ మురళి నటుడి కంటే ముందు రచయిత. ఆపరేషన్ దుర్యోధన, సీతయ్య, మాస్టర్, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, ప్రేమించుకుందాం రా వంటి 50కి పైగా సినిమాలకు మాటలు అందించారు. ఆయన వద్ద శిష్యులు గా పనిచేసిన 30 మందిలో త్రివిక్రమ్ ఒకరు. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో అత్తారింటికి దారేది సినిమాలో పోసాని నటించారు. ఆ తర్వాత “అ.. ఆ” చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 2 విడుదల కానుంది. ఈ సందర్భంగా శిష్యుడు త్రివిక్రమ్ గురించి గురువు పోసాని కృష్ణ మురళి కొన్ని విషయాలు చెప్పారు.

“నా దగ్గర పని చేసినప్పుడు త్రివిక్రమ్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఎటువంటి గర్వం లేదు. ఫోజు కొట్టడు. గడ్డం ఒక్కటే పెరిగింది” అని పోసాని చెప్పారు. ఇంకా త్రివిక్రమ్ పనితీరు గురించి మాట్లాడుతూ ” కథ నుంచి మాటలు పుడతాయి. కాని మాటల నుంచి కథ పుడుతుందని పరిశ్రమకి చూపించాడు త్రివిక్రమ్. స్వతంత్రం పేరు చెబితే గాంధీ గారు గుర్తుకు వస్తారు. మానవత్వం గురించి చెప్పాలంటే మదర్ థెరిస్సా గుర్తుకు వస్తుంది. మాటలు గురించి చెప్పాలంటే త్రివిక్రమ్ గుర్తుకు వస్తాడు. అతను రాసిన మాటలు మళ్లీ, మళ్లీ వినాలని పిస్తుంది.” అని అభినందించారు. “అ.. ఆ” చిత్రంలో పోసాని కృష్ణ మురళి విభిన్నమైన పాత్రలో కామెడీ పండించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus