ఎన్టీఆర్ బయోపిక్ ఆపమని చెప్పిన పోసాని!

టాలీవుడ్ లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ఎవరు అని అడగగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు ‘రామ్ గోపాల్ వర్మ’. అయితే ఇప్పటివరకూ ఎన్నో వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ పై కన్నేసాడు…సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి నట సింహం బాలయ్య తో ఈ సినిమాని తెరకెక్కించే విధంగా పక్కా వ్యూహంతో దూసుకెళ్లే ప్రయత్నం మొదలు పెట్టాడు, అదే ఊపులో పాటను సైతం రెడీ చేశాడు…కట్ చేస్తే పాట వైరల్ గా మారి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయితే ఇదిలా ఉంటే ఈ విషయంలో నందమూరి అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నప్పటికీ ఒక దర్శకుడు, రచయిత, ఆర్టిస్ట్ మాత్రం కాస్త కోపంగా ఉన్నట్లు సమాచారం…ఇంతకీ ఎవరు అతడు అంటే…ఒక్కసారి ఈ కధ చదవండి మీకే ఒక క్లారిటీ వస్తుంది…మ్యాటర్ లోకి వెళితే…తెలుగు ఇండస్ట్రీలో మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి తర్వాత దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళికి వర్మ నిర్ణయం ఏమాత్రం నచ్చలేదట.

వర్మ నిర్ణయంపై పోసాని తీవ్రంగా స్పందిస్తూ…. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందించాలనుకోవడం మంచిదేనని అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఆ బాధ్యతలను అప్పగించడం సరైన నిర్హయం కాదు అని తన మాన్సులోని మాటను తెలిపాడు. అదే క్రమంలో ఎన్టీఆర్ కి చలన చిత్ర రంగంలో ఆయనకు ఎంతో మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే…అయితే రాజకీయాల్లో ఆయన చేసిన మార్పులు చేర్పులు చూపిస్తారా.. ఎన్టీఆర్ శతృవులను, నమ్మకద్రోహులను చూపిస్తానన్నారు అది ఎంత వరకు నిజం అని అంటున్నారు.  అంతే కాదు  ఈ సినిమా వలన ఎన్టీఆర్ మీద ఎలాంటి మచ్చ పడకూడదన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఎవరెస్ట్ శిఖరమని ఆయనను కొనియాడారు. అవమానించేలా సినిమా తీస్తే జనం వెంటపడి కొడతారని,ఎన్టీఆర్ బయోపిక్ తీసే ప్రయత్నాన్ని మానుకోవాలని వర్మను కోరాడు. మిత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ పై అభిమానం చూపిస్తూనే వర్మపై ఫైర్ అయ్యాడు మన పోసాని…మరి ఈ కధ ఎంత దూరం వెళుతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus