బిగ్‌బాస్‌4: హారిక.. సాయిపల్లవి అయితే… అభిజీత్‌.. విజయ్‌ దేవరకొండ అయితే…!

  • October 12, 2020 / 10:31 AM IST

బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు ఏ పేరైతే బాగుంటుంది, ఏ నిక్‌ నేమ్‌ అయితే బాగుంటుంది, ఏ ట్యాగ్‌ అయితే బాగుంటుందని అభిమానులు, నెటిజన్లు సోషల్‌ మీడియాలో రకరకాల పోస్ట్‌లు, పోస్టర్లు పెడుతున్నారు. వాటిని చూసి మీరూ నవ్వుకుని ఉంటారు. ఆదివారం బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఇలాంటిదే జరిగింది. బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు సరిపడే పోస్టర్లు అంటూ కొన్ని చూపించారు. అయితే అంతకుముందు ఆ సినిమా పేర్లతో డమ్‌ షెరాట్స్‌ ఆడించాడు నాగార్జున.

 

ఇంట్లో అర్ధరాత్రులు గుసగుసలాడే లాస్య, సుజాతకు ‘ఊహలుగుసగుసలాడే’ పోస్టర్‌ బాగుంటుందని ఇంటి సభ్యులు అన్నారు. అయితే బిగ్‌బాస్‌ ప్రేక్షకులు మాత్రం సుజాతకు ఆ పోస్టర్‌ ఇచ్చారు. ప్రోమోలో చూపించినట్లుగా అభిజీత్‌ను ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చేసేశారు. ఇంట్లో ‘రేసుగుర్రం’ లాంటివాడు అంటూ మెహబూబ్‌కు ఆ పోస్టర్‌ ఇచ్చారు. విజయ్‌ కొత్త సినిమా ‘మాస్టర్‌’ పోస్టర్‌ను అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌కు సూచించారు అభిమానులు. ఇంట్లో వాళ్లు కూడా అదే అన్నారనుకోండి.

ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడేముందు హగ్గులు ఇవ్వడం నోయల్‌కు అలవాటు. అందుకే అతనికి హగ్గుల డాక్టర్‌ అంటూ ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ పోస్టర్‌ ఇచ్చారు. ఇంట్లో జల్సాగా ఉండే వ్యక్తిగా హారిక అని ఇంటి సభ్యులు చెప్పగా.. ఆరియానా అని అభిమానులు అన్నారు. సోహైల్‌కు ఓ డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. అది ‘పోకిరి’లో మహేశ్‌బాబులా ఉంటుందని ఆ పోస్టర్‌ ఇచ్చారు. ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తుల్లో లాస్య, అవినాష్‌ కచ్చితంగా ఉంటారు. అందుకే ‘డార్లింగ్‌’ పోస్టర్‌ అవినాష్‌ దక్కింది. అయితే ఇంట్లోవాళ్లు లాస్య అన్నారనుకోండి.

ఇక మోనాల్‌ను ఇంటి సభ్యులు సమంత చేసేశారు. ‘ఏ మాయ చేసావె’లో సమంత అంటూ ఆడియన్స్‌ కూడా పోస్టర్‌ ఇచ్చారు. ‘నాకు పెళ్లి చేసేయండి నాన్నా…’ అంటూ దివి అంటే ఎలా ఉంటుంది. ఆ అవును దివిని ‘అందాల రాక్షసి’లో లావణ్య త్రిపాఠిని చేసేశారు. ‘మత్తు వదలరా’ పోస్టర్‌ విషయంలో పోటీ నెలకొంది. ఇంటి సభ్యులు సోహైల్‌ అంటే… జనాలు మాత్రం కుమార్‌ సాయి అన్నారు. ఇద్దరూ వీలు దొరికితే కునుకేసే బ్యాచే కదా.

వరుణ్‌తేజ్‌ ‘ఫిదా’ పేరు చెప్పడానికి, చెప్పించడానికి లాస్య, మెహబూబ్‌ నానా కష్టాలు పడ్డారు. ఆఖరికి చెప్పలేకపోయారు. మెహబూబ్‌ ఎంత చెప్పినా లాస్య అర్థం చేసుకోలేకపోయింది. ఆఖరికి ఆ పోస్టర్‌ హారికకు ఇచ్చింది. పోస్టర్‌ మాత్రం బాగా సూట్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ ఇంట్లో అర్జున్‌ రెడ్డి ఎవరు అంటే… అందరూ ఠక్కున చెప్పే పేరు అఖిల్‌. ఇంటి సభ్యులు కూడా అదే అన్నారు. ఆ పేరుతో పోస్టర్‌ ఇచ్చేశారు. ఆఖరిగా ‘పెదరాయుడు’ పేరును సోహైల్‌ చెప్పలేకపోయాడు. కుమార్‌ సాయి ట్రాక్‌ తప్పాడు.. సోహైల్‌ అర్థం చేసుకోలేకపోయాడు. ఆఖరికి ఆ పేరు లాస్యకు వచ్చింది. పోస్టర్‌ మాత్రం భయంకరంగా ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus